NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి అక్రమంగా అదుపులో తీసుకున్నారు పోలీసులు. హుజూరాబాద్ నియోజకవర్గ జమ్మికుంట మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లయ్య కుమారుడు సందీప్ మృతి చెందగా.. వారి కుటుంబాన్ని పరామర్శించడానికి నారాయణగూడలోని తన నివాసం నుంచి NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి ఇవాళ ఉదయం బయలు దేరారు.
జమ్మికుంట బయలుదేరిన వెంకట్ బల్మూరిని పోలీసులు అడ్డుకున్నారు. జమ్మికుంటకు వెళ్లడానికి వీళ్లేదంటూ ఆయన్ను ఉప్పల్ క్రాస్ రోడ్డు వద్ద కారును ఆపి.. వెంకట్‌ను అదుపులో తీసుకున్నారు. తన కారునుంచి బలవంతంగా తీసుకువచ్చి పోలీసు కారులో కూర్చోబెట్టారు. ఎందుకు అంటున్న సమాధానం చెప్పకుండా కారులో బలవంతంగా లోపలికితోస్తూ కూర్చోబెట్టారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడిగా సమాధానం చెప్పకుండా వెంకట్‌ను నారాయణగూడ పోలీస్టేషన్‌కు తరలించారు.
కనీస సమాచారం లేకుండా, ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారని బల్మూరి వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ కారణం అడుగుతున్నా సమాధానం ఇవ్వకుండా అరెస్టులు చేయడం దారుణమన్నారు. పరామర్శించేందుకు కూడా వెళ్ళకూడదా అంటూ మండిపడ్డారు. కొడుకు కోల్పోయి పుట్టెడ దుఖంలో వున్నకుంటుంబానికి పరామర్షించేందుకు వెళుతుంటే పోలీసులు కారణం చెప్పకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. తనను ఎందుకు అదుపులో తీసుకున్నారో పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ విషయమై పోలీసుల నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా అదుపులో తీసుకుంటారని పోలీసుల తీరుపై మండి పడ్డారు బల్మూరి వెంకట్.
అయితే NSUI బల్మూరి వెంకట్ ను పోలీసులు అదుపులో తీసుకోవడంపై NSUI కార్యకర్తలు మండిపడుతున్నారు. ఉదయం ఆయన్ను బలవంతంగా తీసుకెళ్ళడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారణం చెప్పకుండా NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ అన్యాయంగా అదుపులో తీసుకున్నా పోలీసుల తీరుపై నిప్పులు చెరుగుతున్నారు.
Vignesh Shivan: క్షమాపణలు చెప్పిన నయనతార భర్త