టాప్ సెలబ్రిటీల ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఆత్మహత్యకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కార్బన్ మోనాక్సైడ్‌ను స్టిమ్ లో కలుపుకుని పీల్చి ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు నిర్దారించారు. ఈ మేరకు ఆమె గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్‌ను పోలీసులు కనుగొన్నారు. తన ఇంట్లోని బాత్ రూమ్‌లో ప్రత్యూష విగత జీవిగా పడి ఉన్న విషయాన్ని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థతికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ప్రత్యూష సూసైడ్ లెటర్, పెన్ డ్రైవ్, మొబైల్ ను సీజ్ చేసిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది తాను కోరుకున్న జీవితం కాదని, తల్లిదండ్రులకు భారంగా ఉండలేనని అందులో ఉంది. ప్రత్యుష గరిమెళ్ల రిటైర్డ్ ఐఆర్ఎస్ కృష్ణారావు కూతురు. ఇండియాలో టాప్ 30 ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరిగా ప్రత్యూష ఎదిగింది. టాలీవుడ్, బాలీవుడ్ తారలకు ఫ్యాషన్ డిజైనర్ గా వ్యవహరించిన ఆమె.. దక్షిణాదిలో దాదాపు అందరు హీరోయిన్లకు డ్రెస్ లు డిజైన్ చేసింది. హీరోయిన్ కృతిశెట్టి, రానా భార్య మిహికా, నిహారికతో పాటు పలువురు సెలబ్రిటీలకు డిజైనర్ గా వ్యవహరించింది.
అయితే.. ఓ ప్రముఖ హీరోయిన్ తో ప్రత్యూష చివరిగా మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు ముందు సెల్ ఫోన్ లో సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన పరిస్థితి మొత్తం స్నేహితులకు షేర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన ఫ్లాట్ లో ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడింది. డిప్రెషన్‌కు గురైన నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు. తల్లిదండ్రులు అభ్యర్థన మేరకు ప్రత్యూష మృతదేహాన్ని అపోలోకి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఇవాళ ఆదివారం హైదరాబాద్ లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.