సోషల్ మీడియా వచ్చాకా మంచి ఎంత జరుగుతుందో దానికి మించిన చెడు కూడా జరుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.. చిన్న పిల్లల దగ్గరనుంచి.. రేపో మాపో చనిపోయేవారు కూడా ఫోన్, సోషల్ మీడియాలో అకౌంట్ లేకుండా ఉండడంలేదు. ఇక కామాంధుల సంగతి సరేసరి.. ఎక్కడ అమ్మాయి దొరుకుతుందా..? అని ఎదురు చూస్తూ ఉంటారు.. కొంచెం గ్యాప్ దొరికినా కూడా వారికి మాయమాటలు చెప్పి వలలో వేసుకొని వారిపై అఘాయిత్యాలకు పాల్పడతారు.. అయితే ఇలాంటి పనులు ఆకతాయిలు చేస్తున్నారు అనుకోవడానికి కూడా లేదు.. బడా బడా వ్యాపారవేత్తలు కూడా కామంతో కళ్ళు మూసుకుపోయి అమ్మాయిలను ట్రాప్ చేసి వారిని లొంగదీసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ ఫార్మా కంపెనీ ఎండీ గుప్తా కూడా ఇదే తరహాలో ఒక అమ్మాయిని మోసం చేయడం సంచలంగా మారింది.
వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని ప్రముఖ ఫార్మా కంపెనీ ఎండీ గుప్తా సోషల్ మీడియా లో ఒక అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు. కొన్నిరోజులు ఆ పరిచయం స్నేహం గా మారింది. అయితే ఒకరోజు ఆమెను హోటల్ కు రమ్మని పిలిచాడు. స్నేహం కొద్దీ ఆమె హోటల్ కు వెళ్లగా అక్కడ ఆమె తాగే కూల్ డ్రింక్ లో డ్రగ్స్ కలిపి ఆమెకు తాగించాడు. అనంతరం ఆమె మత్తులోకి జారుకున్నాకా ఆమెపై అత్యచారానికి పాల్పడ్డాడు. యువతి మెలుకువ వచ్చి చూడగా అతడు కనిపించలేదు.. దీంతో ఆమె తనపై అఘాయిత్యం చేసిన గుప్తాపై ఢిల్లీ పోలీసులకు ఫుర్యాదు చేసింది. స్టార్ హోటల్ కి తనను పిలిచి గుప్తా తనపైన అత్యాచారానికి పాల్పడ్డాడని, తనకు డ్రగ్స్ ఇచ్చి స్పృహ లేకుండా చేసి తన జీవితాన్ని నాశనం చేసాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. బాధిత యువతి ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు గుప్తా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఢిల్లీ, హైదరాబాద్ లో కూడా గుప్తా కోసం వెతికామని ఎక్కడా అతడు లేడని, అతడు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.