జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కేసు తెలంగాణలోనే సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. పోలీసులు నిందితులను విచారిస్తున్న క్రమంలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో A1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ కు నేడు చివరి రోజు కావడంతో ఉత్కంఠంగా మారింది.
మిగతా ఐదుగురు మైనర్లతో పాటు సాదుద్దీన్ ను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించనున్నారు. ఈ కేసులో ఏ1 అయిన సాదుద్దీన్ తో పాటు ఈ కేసులో అందరూ నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.. నిందితులందరికి ఉస్మానియాలోని ఫోరెన్సిక్ విభాగంలో లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారు. అయితే ఈకేసులో బాధిత అమ్మాయి మెడికల్ రిపోర్ట్ కీలకంగా మారనుంది.
కేసు తీవ్రత దృష్ట్యా బాధితురాలికి ఇప్పటికే రెండు సార్లు వైద్య పరీక్షలు చేశారు. ఆ నివేదిక ప్రకారం..’లైంగిక దాడి జరిగే సమయంలో మైనర్ మెడపై నిందితులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో బాలిక లైంగిక దాడికి నిరాకరించడంతో నిందితులు ఆమెపై గోళ్లతో దాడికి చేయడంతో బాలిక శరీరంపై 12 గాయాలు ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
Drunk and Drive : అది కడుపేనా.. 15 బీర్లుతాగి బండిపై వస్తుంటే..!