కరోనా మహమ్మరి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ అదుపులోకి వస్తుంది అనుకుంటున్న సమయంలో మళ్ళీ మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందుతోందనే వార్త ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే 20 దేశాలకు మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందింది. సుమారు 200కు పైగా కేసులు నమోదు కూడా అయ్యాయని, మరో 100 అనుమానిత కేసులు ఉన్నాయని విశ్వయనీయ సమాచారం. అయితే మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న తరుణంలో పలుదేశాలు, రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి.…
నగరంలోని రాంగోపాల్‌పేట్‌లోని తకీల పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అర్ధరాత్రి వరకు అనుమతి లేకుండా పబ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందటంతో.. పోలీసులు దాడి చేశామని అన్నారు. పబ్ లోని 18 మందిని అదుపులో తీసుకున్నట్లు సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేర్కొన్నారు. పబ్ లో అనుమతి లేకుండా యువతులతో నృత్యాలు చేయిస్తున్నారని అన్నారు. 8 మంది డ్యాన్సింగ్ గర్ల్స్, 8 మంది కస్టమర్స్, డీజే ఆపరేటర్, ఆర్గనైజర్‌ను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. తకీల పబ్‌ను సీజ్ చేసినట్లు…
పెరుగుతోన్న ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. వాహనదారులు బండి బయటకు తీయలేని పరిస్థితి నెలకొంది. ఇంధన ధరలు క్రమంగా ఎగబాకుతూ వచ్చి క్రమాంగా లీటరుకు రూ.120 దాటాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం మరోసారి తగ్గించింది. దీంతో భారీ ఎత్తున ధరల్లో మార్పు కనిపించింది. పెట్రోల్ ధరలో రూ.9 కి పైగా, డీజిల్ ధరలో రూ.7 రూపాయలకు పైగా తగ్గింది. దీంతో కాస్తయినా ఉపశమనం కలిగిందని సామాన్యులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు…
ఈనెల 29న (ఆదివారం) ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటుండడంతో పలు మార్గాల్లో 34 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. లింగంపల్లి-హైదరాబాద్ స్టేషన్ల మధ్య 18 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి 14, సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య 2 చొప్పున సర్వీసులు రద్దయ్యాయి. రద్దయిన మార్గాల్లో సిటీ బస్సులు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయిన మార్గాల్లో అదనంగా సిటీ బస్సులు నడుపాలని అధికారులు నిర్ణయించారు. కేశవగిరి నుంచి బోరబండ వరకు (22), సికింద్రాబాద్ నుంచి హైటెక్‌సిటీ (54),…
యువతపై సినిమాల ప్రభావం ఎంతుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒక స్టార్ హీరో సినిమా వచ్చిందంటే చాలు.. వాళ్ళ హెయిర్ స్టైల్ దగ్గర నుంచి డ్రెస్సింగ్ స్టైల్, యాటిట్యూడ్ దాకా.. అన్ని అనుసరించడం మొదలుపెడతారు. దాదాపు తమ అభిమాను హీరోలు సినిమాల్లో చేసిన పనులనే, రియల్ లైఫ్‌లోనూ చేయాలని ప్రయత్నిస్తారు. కొందరైతే స్టంట్లు కూడా చేస్తుంటారు. ఇలా చేసి కొందరు లేనిపోని సమస్యల్లో చిక్కుకున్న సందర్భాలున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ టీనేజ్ కూడా.. తన అభిమాన హీరోలాగే…
ప్రస్తుతం సమంత చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అందులో కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే అక్కడ ఒకటి, అరా సినిమాలకు, వెబ్ సిరీస్‌కు సైన్ చేసింది. అలానే ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఓకే చేసింది. అయితే ఇవన్నీ కూడా ముంబైలో ఉంటూ ఆపరేట్ చేస్తోంది సమంత. ఈ నేపథ్యంలో సామ్ ముంబైకి మకాం మార్చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ టాప్ సెలబ్రిటీ కాలనీలో సమంత ఓ ఖరీదైన ప్లాట్ తీసుకుందని వార్తలొచ్చాయి.…
కేసీఆర్ ఇతర రాష్ట్రంలో రైతులకు పరిహారం ఇవ్వడంపై అత్త సొమ్ము అల్లుడి దానం చేసినట్లు ఉందని వైఎస్ షర్మిల ఎద్దేవచేశారు. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రను ఇవాల్టి (శనివారం) నుంచి పునఃప్రారంభించనున్న సంగతి తెలిసిందే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తాళ్లమడ గ్రామం వద్ద పాదయాత్ర 1000 కి.మీ పైలాన్ నుంచే పాదయాత్ర సందర్భంగా మాట్లాడుతూ.. టిఆర్ ఎస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ఖజానా ఖాళీ కావడం కేసీఆర్ అసమర్థ పాలనకు నిదర్శనమని ఆగ్రహం…
ఇవాళ దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి. ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు ట్యాంక్ బండ్ వద్దగల ఎన్టీఆర్ ఘాటికి వెళ్లి నివాళ్లు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈమేరకు ఈ రోజు ఉదయం జూనియ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, లక్ష్మీపార్వతి తదితరులు సందర్శించి, నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఒక మహానటుడుగా ప్రపంచనికి ఖ్యాతి తెచ్చిన వ్యక్తి. ఎన్టీఆర్ అవతార పురుషుడు. చరిత్రలోనే రాముడు, కృష్ణుడిని భూమి మీదకు తీసుకొచ్చిన…
పదవ తరగతి ప్రధాన పరీక్షలు నేటితో ముగియనున్నాయి. వొకేషనల్ విద్యార్థులు మాత్రం మరో రెండు పరీక్షలు రాయాల్సి ఉంది. వారికి జూన్1న చివరి పరీక్ష ఉంటుంది. కరోనాను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది పరీక్షలను 6 పేపర్లకే పరిమితం చేశారు. జూన్ 2న స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభించనున్నారు. జూన్ 25 లోపే ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు ఈనెల 23న ప్రారంభమైన విషయం తెలిసిందే.కరోనా కారణంగా రెండేండ్ల తర్వాత మొదటి సారిగా…
మంచి ఆకలి మీద వున్న మీరు ఏదైనా హోటల్ కి వెళ్ళి బిర్యానీ తినాలనుకుంటారు. బిర్యానీ పార్శిల్ తెచ్చుకుని తిందామని అనుకుంటే.. మీకు అనుకోని అతిథి వచ్చి మిమ్మల్ని డిస్ట్రబ్ చేస్తాడు. ఆ అతిథి ఎవరో కాదు ఏ బల్లో లేదా బొద్దింకో. అంతే మీ మూడ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. హైదరాబాద్ కి చెందిన ఓ వినియోగదారుడి బిర్యానీలో బల్లి ప్రత్యక్షమయింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఓ బిర్యానీ హోటల్ లో బిర్యానీ కొన్నాడు…