హైదరాబాద్ లోని అప్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిగూడలో కెమికల్ పేలుడు సంభవించింది. ఈ
ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మ్యాన్‌హోల్‌లో కెమికల్ వేసి నీళ్లు పోస్తుండగా ఒక్కసారిగా అందులో బ్లాస్ట్ జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న క్లూస్ టీ సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టింది. కెమికల్ బ్లాస్ట్‌లో మరణించిన వ్యక్తిని భరత్ బాతోడ్ (కొడుకు).. గాయాలైన వ్యక్తిని గోపాల్ బాతోడ్‌గా (తండ్రి)గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జూన్ 5న ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.. ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలిపోవడంతో పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో 12 మంది మృతి చెందగా మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. శరీర భాగాలు తెగిపోయి.. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు కనిపించాయి.
ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌గా స్థానిక అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం. అందులోని బాయిలర్ యూనిట్ పేలడం వల్లే ప్రమాదం జరిగినట్లు ఆ అధికారి తెలిపారు. ఆ ఫ్యాక్టరీలో కేవలం ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి మాత్రమే అనుమతి ఉందని.. కానీ అది కాకుండా ఇంకేవో ఉత్పత్తి చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. సంఘటనా స్థలంలో గన్‌పౌడర్ ఆనవాళ్లు లభించాయన్నారు.