జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. తాజాగా మరో విషయం బట్టబయలైంది. ఆ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత నిందితులు ఇన్నోవా కారులో మొయినాబాద్‌కు వెళ్లినట్టు తేలింది. అక్కడ ఓ రాజకీయ నేతకు చెందిన ఫామ్‌హౌస్‌లో ఆశ్రయం పొందినట్టు తెలిసింది. ఆ ఫామ్‌హౌస్ వెనకాలే ఇన్నోవా కారుని దాచిన నిందితులు.. వాహనానికి ఉన్న గవర్నమెంట్ స్టిక్కర్‌ను సైతం తొలగించినట్లు సమాచారం. ఆ ఫామ్‌హౌస్‌లో సేద తీరిన తర్వాత, అక్కడి నుంచి నిందితులు…
సూరీడు సుర్రుమంటున్నాడు. పొద్దున 8 దాటకముందే చెమటలు పట్టిస్తున్నాడు. మధ్యాహ్నం నడినెత్తి మీదకు వచ్చేసరికి జనానికి ఉగ్రరూపం చూపిస్తున్నాడు. సాయంత్రం ఆరు వరకు భానుడి భగభగల నుంచి జనానికి ఉపశమనం లభించడంలేదు. రాత్రివేళల్లోనూ వేడి గాలులతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వేసవి ప్రారంభానికి ముందే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో సూర్యుడి ప్రతాపం ఏ రేంజ్లో ఉంటుందోనని జనం భయపడుతున్నారు. ఇక రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూరీడు తన…
జూబ్లీహిల్స్ లో.. జరిగిన మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసు ఇంకా కొలిక్కిరాలేదు. ఆకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రాష్ట్రమంతా దీనిపైనే ఫోకస్ పెట్టింది. దీంతో.. పబ్బులపై పోలీసులు దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. ఆలస్యంగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలికను క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. ఇక వివరాల్లో వెలితే..హైదరాబాద్ లోని మొగల్ పురా పోలీస్టేషన్ పరిధిలో బాలిక తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. రోజు సమయానికి ఇంటివచ్చే కుమార్తె…
సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు నియమాలను పాటించని పబ్ లు ఆజ్యం పోస్తున్నాయని తెలంగాణ NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి ఆగ్రం వ్యక్తం చేశారు. తెలంగాణ NSUI బృందం శంషాబాద్ ఎయిరో ప్లాజా కాంప్లెక్స్ లోని సిప్ ఆఫ్ స్కై,చికెన్ వైల్డ్ వింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్ ల వద్దకు తనిఖీ కోసం వెళ్లారు. అర్థరాత్రి 12 గంటలకు మూసెయ్యాల్సిన పబ్ లు ఉదయం 3 గంటలకు కూడా ఇంకా నడుస్తూనే ఉండడంతో అక్కడి పబ్ నిర్వాహకులపై…
జూబ్లీహిల్స్ రొమోనియా బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన కీలకమలుపులు తిరుగుతోంది. అందులో ప్రజాప్రతినిధుల పిల్లలు ఉండటం.. పోలీసులు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. బాలికతో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు అసభ్యంగా ప్రవర్తించాడంటూ పలు ఫొటోలు, వీడియోలు బయటికి మరింత అలజడికి కారణమవుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఘటనకు సంబంధించిన ఆధారాలను, ఫొటోలను మీడియాకు విడుదల చేస్తూ.. టీఆర్ఎస్ సర్కారు, ఎంఐఎంలపై ఆరోపణలు గుప్పించారు. బీజేపీ ప్రతినిధి బృందం…
అసలే మందు తాగారు. ఏం చేస్తున్నారో తెలీని పరిస్థితి. మందు తలకెక్కితే విచక్షణ మరిచిపోతారు. హైదరాబాద్ లో మందుబాబులు తమ ప్రతాపం చూపారు..హైదరాబాద్‌లో మందుబాబులు చేసిన పనిపై పోలీసులు మండిపడుతున్నారు. పీకలదాకా తాగి.. కారుతో సీపీ కార్యాలయం గేటునే ఢీకొట్టారు. పీకలదాకా తాగి.. కారులో రయ్‌రయ్‌మంటూ షికారు చేశారు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేశారు. మత్తులో తేలిపోతున్న మందుబాబు కారును కూడా గాల్లోకి పోనిచ్చాడు. ఇంకేముంది.. మూసుకుపోతున్న కళ్లకు ముందు ఏముందో కనపడక ఓ గేటును…
ఆన్ లైన్ గేమ్స్ కు బానిస అవుతూ చాాలా మంది పిల్లలు మానసిక రోగాలకు గురవుతున్నారు. కొంత మంది ప్రాణాలు తీసుకునే స్థితికి వెళ్లిపోతున్నారు. ఇంతలా గేమ్స్ పిల్లల్ని ప్రభావితం చేస్తున్నాయి. తల్లిదండ్రులకు తెలియకుండా అప్పులు చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల చాలా చోట్ల వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఆన్ లైన్ గేమ్స్ కు బానిస అయిన ఓ పిల్లాడు ఏకంగా తల్లి అకౌంట్ లో డబ్బులు లేకుండా చేశాడు. వివరాల్లోకి…
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను, 15వ ఆర్థిక సంఘం నిధులను గత కొద్ది నెలలుగా నిలిపివేసిందని, దీనివల్ల స్థానిక సంస్థల అభివృద్ధి కుంటుపడుతున్నదని సర్పంచుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును నాయకులు కలిసిశారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ వివక్ష తగదని , కేంద్ర నిధులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆ నిధులు వచ్చేలా కేంద్రంపై వత్తిడి తేవాలని విజ్ఞప్తిచేశామన్నారు.…
ఇటీవల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. దాంతో దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధర దాదాపు రూ.10 మేర దిగిరాగా, డీజిల్ ధర రూ.7 మేర తగ్గడంతో వాహనదారులకు ఊరట లభించింది. నగరంలో ఇంధన ధరలు వరుసగా నాలుగో రోజు నిలకడగా వుండటంతో..హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 స్థిరంగానే ఉన్నాయి. వరంగల్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.16 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.35 అయింది. వరంగల్…
హైదరాబాద్ లోని నిమ్స్ లో రేడియాలజి విభాగంలో పనిచేస్తున్న యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఆ విభాగములోని ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యుల పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి చెందిన దువ్వసి సరస్వతిగా గుర్తించారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక వివరాల్లో వెలితే.. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి కి చెందిన తండ్రి యాదయ్యకు ఆర్టీసీ డ్రైవర్…