Revanth Reddy: కాంగ్రెస్ లో చేరికలు.. రేవంత్ పై గుర్రుమంటున్న నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల తుఫాన్ మొదలైంది. కాంగ్రెస్ లో ఇతర పార్టీ నేతలు చేరడంపై స్థానిక సీనిరయర్ నేతల్లో అసంతృప్తి ఎదురవుతోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేరికలపై వన్ మెన్ షో చేస్తున్నాడని విమర్శలు వెలువడుతున్నాయి. రేవంత్ రెడ్డి ఇటు సీనియర్లకు, అటు చేరికల కమిటీకి కూడా సమాచారం లేకుండానే తనంతకు తానే వ్యవహరించడం పై విమర్శలకు తావులేపుతోంది. జానారెడ్డికి చేరికల పరిశీలన కోసం చైర్మన్‌గా కమిటీ వేసిన విషయం తెలిసిందే. అయినా కానీ ఆ కమిటీకి తెలియకుండానే చేరికలు కొనసాగుతుండటం చర్చలకు దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొనేంతవరకు తమ పార్టీలోకి ఎవరు వస్తున్నారో సీనియర్లతోపాటు ఆయా స్థానిక నేతలకు కూడా తెలియడం లేదని టాక్. ఇందుకు నిదర్శనమే ఖైరతాబాద్ నుంచి విజయారెడ్డి, ఖమ్మం నుంచి తాటి వెంకటేశ్వర్ల చేరిక అని చెప్పవచ్చు.
ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క కీలకమైన నేత, శాసనసభ పక్షనేతతోపాటు పార్టీలోనే సీనియర్ కూడా ఆయన. భట్టి సొంత జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లును పార్టీలో చేర్చుకోవడంపై ఆయనకు కనీస సమాచారం కూడా లేకపోవడం గమనార్హం. కాంగ్రెస్ లో శుక్రవారం రోజు వెంకటేశ్వర్లు చేరిక సందర్భంగా భట్టి విక్రమార్కను విలేకరులు ప్రశ్నించగా.. వెంకటేశ్వర్లు చేరికపై ఎలాంటి సమాచారం తదని లేదని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రేవంత్ వ్యవహారం పై ఎంత సీరియస్ గా వున్నారో తెలుస్తోంది. ఆ చేరికలతో జగ్గారెడ్డికి సంబంధం లేదని చెప్పడం గమనార్హం. అంతేకాకుండా కొద్ది రోజుల క్రితం విజయారెడ్డి చేరికపై కూడా స్థానిక కాంగ్రెస్ నేతలైన దాసోజు శ్రావణ్, రాజు యాదవ్, రోహన్‌రెడ్డికి కూడా ఎలాంటి సమాచారం లేదనే తెలుస్తోంది. చేరికలపై రేవంత్ మాత్రమే వన్‌మాన్ ఆర్మీగా వ్యవహరించడం పై అసంతృప్తి చెందిన దాసోజు శ్రావణ్ పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టు ఉంటున్నారని టాక్.
Also Read
- Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
- Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
- Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!