తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ ( TS REDCO) చైర్మన్‌గా నియమితులైన వై. సతీష్ రెడ్డి.. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన.. తనను రాష్ట్ర రెడ్కో చైర్మన్‌గా నియమించినందకు ధన్యవాదాలు తెలిపారు.. కాగా, టీఎస్ రెడ్కో చైర్మన్‌గా వై సతీష్ రెడ్డిని నియమిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.. ప్రస్తుతం టీఆర్ఎస్…
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 22వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్‌రావు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలను హీరో కమ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఆస్పత్రిని నందమూరి తారకరామారావు ప్రారంభించారని.. తెలుగు అంటే అందరికీ ఎన్టీఆర్ పేరు గుర్తుకువస్తుందని బాలయ్య అన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా హాస్పిటల్ స్టార్ట్ చేశామని తెలిపారు. తన తల్లి…
సినీ కార్మికుల వేతన సవరణను తెలుగు చిత్రసీమ పట్టించుకోకపోవడంతో వాతావరణం వేడెక్కుతోంది. సినిమా కార్మికులతో ఇప్పటికే వేతన సవరణ ఒప్పందం చేసుకోవాల్సిన ఫిల్మ్ ఛాంబర్ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే సమయంలో తెలుగు నిర్మాత మండలి సైతం ఫెడరేషన్ సూచనలు, సలహాలను పక్కన పెట్టేసిందన్నది కార్మికుల ఆరోపణ. గతంలో తమతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయనందున ఫెడరేషన్ నేతల మాటను గౌరవించేది లేదని ఇటీవల జరిగిన కార్యవర్గ సమావేశంలో నిర్మాతల మండలి తేల్చి చెప్పేసింది.…
భాగ్యనగరంలోని కైతలాపూర్ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొదటి దశ ఎస్ఆర్డీపీ కింద 8052 కోట్ల రూపాయలతో 47 ప్రాజెక్టులు చేపట్టామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటి వరకూ 30 అందుబాటులోకి వచ్చాయన్నారు. 3117 కోట్ల రూపాయలతో రెండో దశ ఎస్ఆర్డీపీ మొదలు పెడతామన్నారు. దేశ నలుమూలల నుంచి వచ్చి హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. జనాభాకు తగ్గట్టు వసతులు కల్పిస్తున్నామన్నారు. కూకట్పల్లి IDPLలో ఎందుకు రోడ్లు వేస్తున్నారని.. ఇక్కడి కేంద్ర మంత్రి అడగటమే…
హైదరాబాద్ లోని కేంద్ర రక్షణ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను పాకిస్తానీ అమ్మాయిలు ట్రాప్ చేస్తున్నారు. కంచన్‌బాగ్ డి అర్ డి ఎల్ లో తాజాగా బయటపడిన హనీ ట్రాప్ కేస్ లో కీలకాంశాలు బయటపడుతున్నాయి. డీఆర్డీఎల్లో క్వాలిటీ ఇంజనీర్ గా పనిచేస్తున్న మల్లికార్జునరెడ్డిని హనీ ట్రాప్ చేసింది నటాషా అనే అమ్మాయి. కె సీరీస్ మిస్సైల్ కు చెందిన కీలక సమాచారాన్ని నటాషాకు చేరవేశాడు మల్లికార్జునరెడ్డి. యుకే అనుసంద డిఫెన్స్ జర్నలిస్ట్ పేరుతో ట్రాప్ చేసింది నటాషా.…
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఒకరోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతున్నాయి. సోమవారం స్థిరంగా ఉన్న ధరల్లో మంగళవారం స్వల్ప పెరుగుదల నమోదైంది. తాజాగా 10 గ్రాముల బంగారంపై 100 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 నుంచి రూ.47,750కి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980 నుంచి రూ.52,080కి చేరింది. బంగారం ధరలు పెరిగేందుకు పలు అంశాలు ప్రభావితం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.…
దొంగతనం.. డబ్బులు సంపాదించడానికి ఏ మార్గాలు దొరక్క, చివరికి ఈ అడ్డదారిని ఎంచుకుంటారు కొందరు! జేబులు కత్తిరించడం దగ్గర నుంచి ఇళ్లకు కన్నాలు వేసేదాకా.. రకరకాల దొంగలు ఉంటారు. ఏదేమైనా సరే, వీరి లక్ష్యం డబ్బులు దొంగలించడమే! అయితే, మనం చెప్పుకోబోయే దొంగ మాత్రం చాలా డిఫరెంట్! సూటిగా, సుత్తి లేకుండా.. నేరుగా అతని స్టోరీలోకి వెళ్లిపోదాం పదండి! ఆ దొంగ పేరు ఫరీద్. హైదరాబాద్ మల్లాపూర్‌కు చెందిన ఇతను, మొదట్లో ఓ కూరగాయాల వ్యాపారి. సైకిల్‌పై…
ప్రపంచ వ్యాప్తంగా జూన్ 21న ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం 8వ ఎడిషన్‌ను ‘మానవత్వం కోసం యోగా’ అనే థీమ్‌తో ప్రపంచ వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలోనూ హైదరాబాద్ నగరంలోనూ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. The Vice President, Shri M. Venkaiah Naidu attended the International Day of Yoga 2022 celebrations organised by the…