విద్యాశాఖా మంత్రి సబితపై వచ్చిన ఆరోపణలపై ఆమె స్పందించారు. ఈనేపథ్యంలో.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలపై స్పందించారు. టీఆర్ఎస్ పార్టీ నేత, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డిని ఎవరో మిస్ గైడ్ చేసి ఉంటారని అన్నారు. స్వయంగా నేను ఆయన్ను కలిసి మాట్లాడుతా అంటూ పేర్కొన్నారు. ఇదేం పెద్ద ఇష్యూ కాదు అంటూ మంత్రి సబితా అన్నారు. కృష్ణన్న ఎందుకు అలా మాట్లాడారో తెలియదని చెప్పారు.
read also: Mangalampalli : మరపురాని మధురం పంచిన మంగళంపల్లి!
నాపై భూ కబ్జాలు.. ఇతర కబ్జాలు చేసినట్టు ఆరోపణలు వస్తే వాటిపై ముఖ్యమంత్రి విచారించి చర్యలు తీసుకుంటారని తెలిపారు. తనపై విచారణ జరుపుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. కబ్జాలు చేసి ఉంటే అలాంటి వాటిని ప్రభుత్వం ఉపేక్షించదని, తప్పకుండా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కృష్ణారెడ్డిని ఎవరో తప్పుదోవ పట్టించారంటూ పేర్కొన్నారు. ఆయన అలా ఎందుకు తనపై మాట్లాడుతున్నారో తెలియదని, దాని గురించి తెలుసుకుంటానని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేసారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ ఈట గణేష్, ఎంపీపీ ప్రియాంక శివశంకర్‌గౌడ్, తదితరులు ఉన్నారు. అయితే.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి భూ కబ్జాలు చేసిందని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే..
Chiru: గౌతమ్ రాజు లాంటి గొప్ప ఎడిటర్‌ను కోల్పోవడం దురదృష్టకరం