చిక్కోడి ప్రవీణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. క్యాసినో వ్యవహారంలో ఈడి సోదాలు ముగిసాయి. అయితే.. Ed సోదాల్లో హవాలా లావాదేవీలు బయట పడ్డాయి. కొంతమంది ప్రముఖుల డబ్బులను హవాలా రూపంలో విదేశాలకు తరలించినట్లుగా ఈడీ గుర్తించింది. మొత్తం 8 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ప్రవీణ్ చికోటి, మాధవ రెడ్డి ఇళల్లో తెల్లవారుజామున వరకు ఈడి సోదాలు నిర్వహించారు. సుమారు 20 గంటల పాటు సోదాలు నిర్వహించింది. తెలంగాణ లో సైదాబాద్, బోయిన్ పల్లీ, కడ్తల్ లో ఈడి సోదాలు చేపట్టింది. ప్రవీణ్ చికొటి ఇంటి నుండి మొబైల్స్, లాప్ టాప్ లను సీజ్ చేసారు అధికారులు. నేపాల్ లో లీగల్ గా క్యాసినో నిర్వహించినట్టు ప్రవీణ్ తెలిపాడు. లాప్ టాప్ లో లభించిన పలు అనుమానాస్పద లావాదేవీలపై ఆరా చేపట్టింది. పంటర్స్ తో జరిపిన పలు లావాదేవీల పై చికోటి నుండి వివరాలు తీసుకున్న ఈడి, హవాలా రూపంలో చెల్లింపులు పై లోతు గా దర్యాప్తు ముమ్మరం చేసింది.
చికోటి ప్రవీణ్ ఇంటి ఫై ఈడీ దాడులు చేయడం సంచలనంగా మారింది. ఫెమా కింద కేసు నమోదు చేసిన ఈడీ.. హైదరాబాద్ లో మొత్తం 8 చోట్ల దాడులు చేస్తోంది. గతంలో గుడివాడ కేసినో కేసులో ఆరోపణలు ఎదురుకున్నారు ప్రవీణ్. హైదరాబాద్ ఐఎస్ సదన్ లోని చికోటి ప్రవీణ్ ఇంట్టో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కేసినో ఆడించడంలో చికోటి ప్రవీణ్ దిట్టగా పేరుపొందారు. గతంలో చికోటి ప్రవీణ్ పైన సిబిఐ కేసు నమోదు చేసింది. తాజాగా చికోటి ప్రవీణ్ ఇంటి ఫై ఈడీ దాడులు చేయడం సంచలనంగా మారింది. నేపాల్ , ఇండోనేషియా, పుక్కెట్ లో క్యాసినోలు నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది. క్యాసినో లలో టాలివుడ్ , బాలీవుడ్ , నేపాలీ డ్యాన్సర్ల చిందులు వేస్తారు. ఫెమా కింద కేసు నమోదు చేసిన ఈడీ.. దాడులు చేస్తోంది. గతంలో బర్త్ డే పేరుతో ఖరీదైన పార్టీలు ఇచ్చిన వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.
Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రితో అంబటి భేటీ