తెలంగాణ రాజ్ భవన్ లో బోనాల పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. రాజ్భవన్ లోని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బోనాలు పండుగ ఘనంగా నిర్వహించారు. ఈనేథ్యంలో.. బోనాల పండుగలోభాగంగా.. గవర్నర్ తమిళసై అమ్మవారికి కోసం స్వయంగా బోనమెత్తారు. గవర్నర్ తన నివాసం నుంచి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాజ్ భవన్లో పండుగలో పాల్గొన్నారు. రాజ్ భవన్లో నివసించే కుటుంబాలతో కలిసి గవర్నర్ తమిళసై బోనాల పండుగను…
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ఘటన మరిచిపోకముందే మళ్లీ వర్షాలు కురుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న (శుక్రవారం) ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లకు భారీగా నీరు చేరడంతో.. గేట్లు తెరిచి మూసీలోకి నీటిని…
బ్యాంక్ ఆఫ్ బరోడా 114 సంవత్సరాలు పూర్తి చేసుకుని 115వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న శుభసందర్భంగా బ్యాంకు స్ట్రీట్ శాఖ పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు మౌలాలిలో గల షాలోమ్ వృద్ధుల ఆశ్రమానికి రూ.25 వేల నిలువ గల వాషింగ్ మెషీన్ను బ్యాంకు సిబ్బంది అందజేశారు.
దేశంలోని అనేక ప్రాంతాల్లో మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి. దేశంలో ప్రతిరోజూ ఇలాంటి ఘటనలకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. లైంగిక వేధింపుల నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఇలాంటి ఘటనలు ఆగడం లేదు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలనే డిమాండ్ కూడా ఉంది. అయితే కొన్ని కేసుల విచారణ త్వరగా పూర్తి చేసి నిందితులకు శిక్షలు కూడా ఖరారు చేశారు. అవన్ని పక్కనపెట్టి వారి పని…
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బోనాల పండుగలో గ్రూప్ రాజకీయాలు సృష్టించొద్దని, ఎవరైనా గొడవలకు దిగితే సహించేదిలేదని హెచ్చరించారు. ఈనేపథ్యంలో.. హైదరాబాద్ పాతబస్తీ సుల్తాన్ షాహీ శ్రీ జగదాంబ అమ్మవారి దేవాలయం వద్ద ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీతో పాటు పాతబస్తీ పరిధిలో ఉన్న ఇతర దేవాలయాలకు బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వ తరఫున మంత్రి చెక్కులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రైవేటు దేవాలయాలకు సైతం ఆర్థిక సహాయం అందించిన ఘనత తెలంగాణ…
రెండు రోజులు నుంచి వర్షాలు తగ్గాయని అనుకునేంతలోపే మళ్లీ తెలుగు రాష్ట్రాలపై మరోసారి వరుణుడు గర్జించనున్నాడు వర్షం నగరాన్ని ముంచెత్తింది. షియర్ జోన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు తెలంగాణ, కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీగా వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ, రేపు హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు హైదరాబాద్లో అక్కడక్కడా భారీ…
15 ఏళ్లనాటి పగ.. దానిని అందరూ మర్చిపోయారు.. కానీ కొడుకు మాత్రం మర్చిపోలేదు.. తండ్రిని చంపిన హంతకులను ఎలాగానే చంపాలని ప్లాన్ చేశాడు. ఇందుకోసం బాగా కష్టపడి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అవతరించాడు. కోట్ల కొద్ది డబ్బులు సంపాదించాడు. తన తండ్రిని మట్టు పెట్టిన హంతకుల కోసం గాలించాడు. చివరికి హంతకులు దొరికారు. అయితే తాను హత్య చేయకుండా మరొకరి చేత హత్య చేయించాడు. రూ. 30 లక్షలను సుఫారీ గ్యాంగ్ ఇచ్చాడు. కర్ణాటక సుపారీ గ్యాంగ్…
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు మందు బాబుల వ్యవహారం తల నోప్పిగా మారింది. మందేస్తే చిందే అన్నట్లు.. మందుబాబుల ఆగడాలు నగరంలో మితిమీరుతున్నాయి. మద్యం సేవించి పోలీసులకు సవాల్ విసురుతున్నారు మందుబాబులు. అర్థరాత్రి అయ్యందంటే మందుబాబులు రెచ్చిపోతున్నారు. ఫుల్ గా తాగి రోడ్డుపై హల్చల్ చేస్తూ.. ప్రజలను, పోలీసులకు తలనొప్పిగా మారుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చట్టప్రకారం నేరమే అయినా తాగిన మత్తులో డ్రైవ్ చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చకుంటున్నారు. వారిని ఆపిన పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇటీవలే మలక్పేట్…