ముందుగా నిర్ణించిన ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ఈ నెల 23వ తేదీనే ప్రారంభం కావాల్సింది ఉంది.. అయితే, వివాదాస్పద వ్యాఖ్యలు చేసి భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యే రాజాసింగ్ ఎఫెక్ట్‌తో అవి చివరి నిమిషంలో వాయిదా వేశారు అధికారులు.. రాజాసింగ్ ఓ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో.. దీంతో.. పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వాయిదా పడిన కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. ఈరోజు ఉదయం 11 గంటలకు మంత్రి కేటీఆర్ లాంఛనంగా చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు.. ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొనే అవకాశం ఉంది.
Read Also: Ban Sale Of Petrol-Powered Cars: పెట్రోల్ కార్లపై నిషేధం..! ఎప్పటి నుంచి అమలంటే..?
కాగా, గతంలోనే చాంద్రాయణగుట్ట చౌరస్తాలో ఫ్లైఓవర్ ఉంది.. 2007లోనే ప్రారంభించారు. కానీ, కూడలిలో ట్రాఫిక్ కష్టాలు పెరుగుతోన్న దృష్ట్యా.. దానిని పొడిగించాలని నిర్ణయించిన జీహెచ్‌ఎంసీ… దానికి 2020లో శ్రీకారం చుట్టింది. 45.79 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ వంతెనతో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఎల్బీనగర్ చౌరస్తా వైపు మరింత వేగంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఎల్బీనగర్ మీదుగా నల్గొండ, వరంగల్ వెళ్లేందుకు ఈ పైవంతెన ఎంతో ఉపయోగపడనుంది.