హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం కింద నిర్మించిన చాంద్రాయణగుట్ట ఫ్లైఓవరు మంత్రి కేటీఆర్ నేడు ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. రూ.45.90 కోట్లతో 674 మీటర్ల పొడవునా ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించగా.. ఈ ఫ్లెఓవర్ ద్వారా చాంద్రాయణగుట్టలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. SRDP ఫలాలు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ప్రజల మౌలిక అవసరాలు పూర్తి చేయడంలో బల్దియా లక్ష్యం నెరవేరే అవకాశం దగ్గరలోనే ఉంది. ఈచాంద్రాయణగుట్ట…
అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి.. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని సమావేశం అదన్న ఆయన.. సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందన్నారు.
ఈనెల 8నుంచి స్వతంత్ర భారత వత్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. నేడు ఎల్బీ స్టేడియంలో 30వేల మంది సమక్షంలో అట్టహాసంగా జరిగే ముగింపు వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. పలువురు సమరయోధులకు సన్మానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ, అంతర్జాతీయ కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఉన్నతాధికారులు పరిశీలించారు. రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు,…
Students Damaged movie theater in hyderabad ఇండియాకు ఇండిపెండెన్స్ డే వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా వజ్రోత్సవాలు నడుస్తున్నాయి. ఇందులో భాగంగా ‘గాంధీ’ సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. తెలంగాణలో విద్యార్థుల కోసం అన్ని థియేటర్లలో మార్నింగ్ షోలలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. అయితే శుక్రవారం నాడు హైదరాబాద్ మల్లేపల్లిలోని ప్రియా థియేటర్లో గాంధీ సినిమాను చూసేందుకు మెహిదీపట్నంలోని ఎంఎస్ కాలేజీకి చెందిన 500 మంది విద్యార్థులు తరలివచ్చారు. ఈ విద్యార్థులు గాంధీగిరి…
మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల నియామకాలకు సిద్ధం అవుతుంది తెలంగాణ ప్రభుత్వం.. ఆ పోస్టులకు సంబంధించిన అర్హతకు సంబంధించి మార్గదర్శకాలను పేర్కొంది ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్… పురపాలక సంఘాల పరిధిలోని సబ్ సెంటర్లలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో నియమించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది… ఆ పోస్టులకు ఎంబీబీఎస్ / బీఏఎంఎస్ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులని స్పష్టం చేసింది.. అందులోనూ ఎంబీబీఎస్ చేసిన వారికి…
Grand Nursery Mela At People’s Plaza Necllace Road: గతంలో ఒక మొక్క పెట్టి ఫోటో దిగి వెళ్లేవారు, కానీ.. ఈ తెలంగాణ వచ్చాక 85 శాతం మొక్కలు బ్రతికేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్ధిక, వైద్యారోగ్యా శాఖ మంత్రి హరీష్ రావు. పీవీ మార్గ్ లోని పీపుల్స్ ప్లాజాలో 12వ గ్రాండ్ నర్సరీ మేళాను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఇవాళ్టి నుండి ఈనెల 22 వరకు గ్రాండ్ నర్సరీ మేళా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.…
Varicose Veins - Modern Treatments: వేరికోస్ వెయిన్స్ వ్యాధి వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. అయితే చాలా మందిలో ఈ వ్యాధికి చికిత్స లేదనే భ్రమలో ఉంటారు. అయితే ఇప్పుడు ఈ వ్యాధిని నయం చేయడానికి అనేక చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి.