తెలంగాణను ఇప్పటికే భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి.. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడినా.. మరికొన్ని జిల్లాల్లో భారీ నష్టాన్ని మిగిల్చాయి.. అయితే, మరో మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయిన వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.. నిన్నటి ఆవర్తనం ఇవాళ కూడా ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని.. పైకి వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపుకి వంపు…
తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్య మరింత పెరగనుంది.. రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ఆరుగురు న్యాయవాదులను జడ్జీలుగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం.
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరోసారి హస్తినబాట పట్టారు.. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయల్దేరిన ఆయన.. రెండు మూడు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు.. గత కొన్ని రోజుల పాటు రాష్ట్రంలోని సమస్యలు, వర్షాలు, వరదలు, సంక్షేమ పథకాలపై దృష్టిసారించిన కేసీఆర్.. మరోసారి జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది.. అందులో భాగంగా రెండు మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్న గులాబీ పార్టీ బాస్.. జాతీయ స్థాయిలో వివిధ కీలక నేతలతో భేటీ…
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. గాయం అయ్యింది.. రెస్ట్‌లో ఉన్నాను అంటూ కేటీర్ ఓటీటీలో సినిమాల కోసం సలహా అడిగితే మేం వెటకారంగా ట్వీట్ చేశాం అన్నారు.. దానికి చిన్న దొర గారికి కోపం వచ్చిందని.. మాపై వ్యక్తిగతంగా విరుచుకుపడ్డారని మండిపడ్డారు.. దమ్ముంటే సబ్జెక్టు మాట్లాడండి.. అధికారం చేతుల్లో ఉంది, పాలన చేతుల్లో ఉంది, ఇంట్లో కూర్చుని…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాలు పండుగ ఘనంగా జరుగుతుంది. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. పోతురాజుల విన్యాసాలతో ఆ ప్రాంగణం అంతా పల్లె వాతావరణాన్ని తలిపించింది. అయితే ఈనేపథ్యంలో.. పాతబస్తీ లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అమ్మవారి ఆలయ సమీపంలో ఓ బృందంపై కొందరు కర్రలతో దాడి చేయడంతో.. ఉద్రికత్త పరిస్థతి నెలకొంది. పోతలింగం ఆలయానికి చెందిన పోతురాజులు రవీందర్, సుధాకర్‌లు సుమారు 20మంది బృందంతో లాల్ దర్వాజా మహంకాళి…
senior cartoonist papa passes away: ప్రముఖ కార్టూనిస్టు పాప (77) శనివారం హైదరాబాద్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన అసలు పేరు కొయ్య శివరామరెడ్డి. బాల్యంలోనే వ్యంగ్య చిత్రాలు గీయడంలో పట్టు సంపాదించిన ఆయన తొలి కార్టూన్ ఆంధ్ర ప్రతికలో ప్రచురితమైంది. ఆ తర్వాత కథలకు బొమ్మలు గీయడంలోనూ ఆయన ప్రావీణ్యం సంపాదించారు. యుక్తవయసులోనే ఆంధ్ర పత్రిక, వసుధ, జోకర్ తదితర వార, మాస పత్రికలకు బొమ్మలు గీశారు. కాలేజీ విద్య పూర్తయ్యాక విశాఖ టౌన్ ప్లానింగ్…
Police Command Control Center: హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఆగస్టు 4న కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి ముందే సీపీ సీవీ ఆనంద్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. బంజారాహిల్స్ లో నిర్మితమవుతున్న ఈ భవనాన్ని శనివారం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. నిర్మాణం…
wine shops closed in hyderabad:హైదరాబాద్ నగరంలో ఆదివారం నాడు బోనాల పండగ అంగరంగ వైభవంగా జరగనుంది. బోనాల పండుగ సందర్భంగా ఆదివారం, సోమవారం (జూలై 24, 25) రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. తిరిగి మళ్లీ మంగళవారం తెరుచుకోనున్నాయి. బోనాల పండుగ నేపథ్యంలో దుకాణాలు మూసి వేయాలని హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ మేరకు రెండు రోజుల పాటు షాపులు మూసివేస్తున్నట్లు అన్ని వైన్స్…
హైదరాబాద్ నార్నింగీలో కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఓ దుండగుడు ఒక చిన్నారి నోరు మూసి, ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే.. అటు వెళ్తున్న ఓ మహిళకు అనుమానం కలగడంతో అడ్డుకుంది. ఎందుకు చిన్నారి నోరు మూశావని గట్టిగా అరుస్తూ నిలదీసింది. దీంతో గాబరాపడ్డ ఆ కిడ్నాపర్.. మహిళని తోసేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే స్థానికులు అతడ్ని పట్టుకున్నారు. చెట్టుకు కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. కిడ్నాపర్‌ను స్టేషన్‌కు…