Theft Case: రోజురోజుకు హైదరాబాద్ లో దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. బస్సులో, రైళ్లల్లో ఆగంతకులతో జాగ్రత్త గా ఉండమని ప్రయాణికులకు చెప్తున్నా ఎక్కడో ఓ చోట దుండగులు రకరకాలుగా దోచుకుంటున్నారు.
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనంపై ఇప్పుడు అధికార టీఆర్ఎస్.. ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల తూటాలు పేల్చుతోంది… వినాయక నిమజ్జన ఏర్పాట్ల విషయంలో కేసీఆర్ సర్కార్ తీరుపై సీరియస్ గా ఉంది బీజేపీ.. రేపు మధ్యాహ్నం వినాయక సాగర్ వెళ్లనున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. నిమజ్జనానికి ఏర్పాట్లు చేయకపోతే ఏం చేయాలో హిందువులకు తెలుసు అని హెచ్చరిస్తున్నారు.. హిందువుల సహనాన్ని పిరికితనంగా భావిస్తారా? హిందూ పండుగలంటే అంత చులకనా? అని ప్రశ్నించిన ఆయన.. తక్షణమే వినాయక్…
తెలంగాణలో మరోసారి వర్షాలు దంచికొడుతున్నాయి.. హైదరాబాద్ సహా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. సిటీలో ఇవాళ రెండు దపాలుగా కురిసిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. లోతట్టు ప్రాంతాలకు వర్షం నీరు చేరడంతో ఇక్కట్టు పడ్డారు.. అయితే, ఎప్పటికప్పుడు వర్షం నీరు వెళ్లేవిధంగా వెంటనే సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు జీహెచ్ఎంసీ సిబ్బంది.. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.. ఇవాళ నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 70.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు…
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ను సవాల్ చేస్తూ.. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన భార్య ఉషాబాయి, కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. పీడీ యాక్ట్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రాజాసింగ్ భార్య.. హైదరాబాద్ పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్ ఎత్తివేసి బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు.. ఇక, ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. మంగళ్‌హాట్ ఎస్‌హెచ్‌వోకు నోటీసులు జారీ చేసింది.. రాజా సింగ్ పై పీడీ…
సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు.. సోషల్ మీడియా వేదికగా తమ కన్నింగ్ ఐడియాలకు పదును పెడుతూ.. అందినకాడికి దండుకుంటున్నారు.. మొదట్లో మైకంలో ఉన్న సదరు వ్యక్తులు.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు.. తీరా జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత లబోదిబోమంటున్నారు. తాజాగా మరో కొత్త ఫ్రాడ్ తెరపైకి వచ్చింది.. ఇన్స్టాగ్రామ్ లో ప్రేమ అంటూ ఓ మహిళకు వలస వేసిన సైబర్ టీచర్… రూ. 4 లక్షలు నొక్కేశాడు.. Read…
నిరుద్యోగులకు వరుసగా శుభవార్తలు వినిపిస్తూనే ఉంది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే పలు శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే కాగా.. ఇవాళ మరో నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)… మహిళా శిశు సంక్షేమ శాఖలో 23 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. www.tspsc.gov.in వెబ్సైట్లో ఈ నెల 13వ తేదీ (13-09-2022) నుంచి వచ్చే నెల 10వ తేదీ (10-10-2022) వరకు ఆన్లైన్లో అప్లికేషన్ సమర్పించాలని…
విద్యార్థులకు షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలోని ప్రముఖ కాలేజీలు సహా 36 కాలేజీల్లో ఫీజు లక్ష రూపాయలు దాటిపోయింది.. ఏడు కళాశాలల్లో ఫీజు లక్షన్నర మించిపోయింది.. రాష్ట్ర ప్రభుత్వం ఫీజులపై ఉత్తర్వులు ఇవ్వకుండానే కౌన్సెలింగ్ ప్రారంభించడంతో.. కళాశాలలు హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందాయి. ఇప్పటి వరకు 79 ఇంజినీరింగ్ కాలేజీలు హైకోర్టు నుంచి అనుమతి పొందగా.. మరికొన్ని కాలేజీలు అదే బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. టీఎస్ఏఎఫ్ఆర్సీ వద్ద అంగీకరించిన ఇంజినీరింగ్ ఫీజులకు హైకోర్టు అనుమతి…