తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంపై ఇప్పుడు భిన్నవాదనలు తెరపైకి వస్తున్నాయి.. విలీనం అని ఓ వైపు.. విమోచనం అని మరోవైపు.. తమ వాదనలు వినిపిస్తున్నారు రాజకీయ నేతలు.. అయితే, వారి ప్రయోజనాల కోసం సాయుధ పోరాటాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని.. రైతాంగ సాయుధ పోరాటాన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం జరుగుతోందని కమ్యూనిస్టు నేతలు మండిపడుతున్నారు.. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి.. రైతు…
Hyderabad: హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా వాహనదారులు ఇబ్బంది పడేది ట్రాఫిక్‌తోనే. ట్రాఫిక్ కారణంగా ఉద్యోగులు ఆలస్యంగా కార్యాలయాలకు వెళ్తుంటారు. ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు కూడా ట్రాఫిక్ ఇబ్బంది పెడుతుంది. ట్రాఫిక్ వల్ల కొంతమంది నరకం చూస్తున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అయితే ట్రాఫిక్‌ను క్లియర్ చేయాల్సిన పోలీసులు ట్రాఫిక్ క్లియరెన్స్ కంటే ఎక్కువగా ఛలానాలపైనే దృష్టి పెడుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్లపై కెమెరాలు పట్టుకుని కూర్చుని, టపాటపా ఫొటోలు తీస్తున్నారు కానీ ట్రాఫిక్…
Hyderabad: హైదరాబాద్ నగరం మహేంద్ర హిల్స్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సెప్టెంబర్ 3న ‘నైపుణ్య’ పేరుతో నిర్వహించిన అంతర్గత పోటీల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తంగా 12 స్కూళ్ల విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ జనార్ధన రాజు, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హాజరయ్యారు. అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ మల్కా కొమరయ్య పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు పోటీల్లో…
Minister Vishwarup Health: ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ (60) శుక్రవారం నాడు వైఎస్ఆర్ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ఆయన్ను హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌కు తరలించారు. ఈరోజు మంత్రి విశ్వరూప్‌ను పరీక్షించిన వైద్యులు శనివారం మధ్యాహ్నం హెల్త్ బులెటిన్‌ను మీడియాకు విడుదల చేశారు. Read Also: Tamilnadu: కూతురి పిండం అమ్మకానికి…
సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ కొత్త ప్రధాన కోచ్‌గా వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారాను నియమించింది. లెజెండరీ బ్యాట్స్‌మన్ టామ్ మూడీ స్థానంలో బ్రియాన్ లారాను ప్రధాని కోచ్‌గా నియమించినట్లు ఎస్ఆర్హెచ్ అధికారికంగా ధ్రువీకరించింది.
షేక్‌పేట్ మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద మృతి చెందడం కలకలం రేపిన విషయం తెలిసిందే. సుజాత మృతితో పలు అనుమానాలు తావులేపుతున్న తరుణంలో నిమ్స్ వైద్యులు సుజాత మృతిపై క్లారిటీ ఇచ్చారు. మాజీ MRO సుజాత గుండె పోటుతోనే మృతి చెందారని నిమ్స్ వైద్యులు దృవీకంరించారు. శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో నిమ్స్ ఆసుపత్రిలో చేరిన సుజాత శనివారం ప్రాణాలు విడిచారని, సుజాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారని వైద్యులు తెలిపారు. మరికాసేపట్లో చిక్కడ పల్లికి సుజాత…
ఎంఐఎం అంటే కేసీఆర్ కు భయం వుంది కాబట్టే.. తెలంగాణ విమోచన దినం నిర్వహించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించాఉ. ఇచ్చిన మాట తప్పి తెలంగాణ అమరులను అవమానిస్తున్న దుర్మార్గుడు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. ‘విమోచన దినం’ కోసం రాజీలేని పోరాటం చేస్తున్న పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. తెలంగాణ విలీన వజ్రోత్సవాల పేరిట మరో జమ్మిక్కుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ నిఖార్సైన తెలంగాణ వాది అయితే…
jubilee hills police petition to consider minors as majors in amnesia pub case: హైదరాబాద్‌లోని అమ్నీషియా పబ్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాలికపై సామూహిక అత్యాచార నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ కోర్టులో కాకుండా సాధారణ న్యాయస్థానంలో విచారణ జరిగే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి సమగ్ర ఆధారాలతో హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఒకట్రెండు రోజుల్లో న్యాయస్థానంలో మెమో దాఖలు చేయనున్నట్లు…
K. A. Paul about World Peace Conferences: ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అక్టోబర్ 2న జింఖాన గ్రౌండ్ లో ప్రపంచ శాంతి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 28 మంది ప్రధానులు రానున్నట్లు సంసిద్ధత వ్యక్తం చేశారని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల కూడా అందర్ని ఆహ్వానించారు అని తెలిపారు. వరణ్ గాంధీని కూడా ఆహ్వనించినట్లు చెప్పారు. అయితే వరణ్ గాంధీని రావద్దని మంత్రి కేటీఆర్ చెప్పారని..స్వయంగా వరణ్ గాంధీనే…
Gold Rates: దేశవ్యాప్తంగా పసిడి ధరలు మరోసారి భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 540 తగ్గి రూ.50,730కి చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి రూ.46,500 కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,950గా నమోదు కాగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,700గా ఉంది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండి…