శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే సామాన్యులపై తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నారు. వాహనాల తనిఖీలు చేస్తుండగా ఓ యువకుడు బైక్ ఆపలేదనే కోపంతో ఎస్ఐ రెచ్చిపోయాడు. ఎస్ఐని అనే రుబాబుతో అతని చెంప చెళ్లుమనిపించడంతో బాధితుడి చెవి డ్యామేజ్ అయింది. ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో తెలుసా. వాహనాలు నడిపే వాళ్లు నిబంధనలు పాటించకపోతే వారిపై కేసులు నమోదు చేయడమే పోలీసుల బాధ్యత. వాహనాల తనిఖీల సమయంలో ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునే…
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ మరోసారి పట్టుబడింది. డార్క్ వెబ్ ద్వారా కన్జూమర్స్ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. గోవా, రాజస్థాన్, ఢిల్లీకి చెందిన డ్రగ్ పెడ్లర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్స్‌తో పాటు ఆరుగురు హైదరాబాద్ వాసులు అదుపులో తీసుకున్నారు. దేశవ్యాప్తంగా డార్క్ వెబ్ ద్వారా వేలాది మందికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. డార్క్ వెబ్ నెట్‌వర్క్‌ను హెచ్‌న్యూ టీమ్ రంగ ప్రవేశంతో బట్టబయలు చేశారు. పోలీసులకు చిక్కిన వారంతా ఉన్నత విద్యావంతులే…
భాగ్యనగరంలో కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది. నగరంలో ఫింగర్ ప్రింట్ సర్జరీ ముఠాను రాచకొండ పోలీసులు గుట్టురట్టు చేశారు. గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు కొత్త తరహాలో ఓముఠా ప్రయత్నాలు చేస్తోంది. అయితే గల్ఫ్ దేశాలకు వెళ్లాలంటే వేలు ముద్ర తప్పనిసరి. అది ఒకే చేశాకే మిగ కార్యక్రమం అంతా పూర్తవ్వాలి. అయితే ఒకసారి రిజక్ట్ అయిన యువకులు మళ్లీ ప్రవేశానికి అనుమతికి ఆగలేక గల్ఫ్‌కు వెళ్లేందుకు కొత్త తరహా టెక్నిక్ కనుగొన్నారు. ఆలోచన వారిదో లేక వేరొకరిదో…
పసిడి ప్రేమికులకు శుభవార్త చెబుతూ.. మరోసారి బంగారం ధరలు కాస్త కిందికి దిగాయి.. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి రూ.47,000కి దిగిరాగా.. 24 క్యారెట్ల10 గ్రాముల పసిడి రూ.270 తగ్గడంతో రూ.51,270కి పరిమితమైంది.. హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలో ఈ రోజు బంగారం ధరలను ఓసారి పరిశీలిస్తే.. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి.. రూ. 47,000కి చేరింది.. 24 క్యారెట్ల 10…
సీఎం సర్కార్‌కు పేదల ప్రాణాల కంటే పేరు ప్రఖ్యాతలే ముఖ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో నలుగురు మహిళల మృతి చెందడానికి కేసీఆర్ సర్కార్ మూర్ఖత్వమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. నేడు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను బండి సంజయ్ పరామర్శించారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, మంత్రి హరీష్ రావు తీరుపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ బాధితులను పరామర్శించకుండా బీహార్…
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు మృతిచెందిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ వల్లనే నలుగురు మృతిచెందినట్లు వైద్యారోగ్యశాఖ ప్రాథమిక విచారణలో తేలింది. ఆపరేషన్‌కు ఉపయోగించే పరికరాలు పాతవి కావడంతో ఈ తరహా చిక్కులు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. నిమ్స్‌లో 19 మంది మహిళలు, మరో పది మందికి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం…
హైదరాబాద్ లోని ఖైరతాబాద్‌లో పంచముఖ మహాలక్ష్మి గణపతి కొలువుదీరాడు. గణపతి ప్రతిష్టాపన పూజ ఉదయం 5గంటల నుంచి ప్రారంభమయ్యింది. ఉదయం 6గంటలకు పద్మశాలి సంఘం ఖైరతాబాద్ నియోజకవర్గం ఆధ్వర్యంలో 60 అడుగుల గాయత్రి, నూలు కండువా, గరికమాలతో రాజ్‌దూత్ చౌరస్తా మీదుగా గుర్రపుబగ్గీలో తెలంగాణ సంస్కృతి కళారూపాలతో ఊరేగింపు నిర్వహించనున్నారు. వినాయక ఊరేగింపులో ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారి కైరంకొండ సంతోష్ నేత ప్రారంభించి, ఉదయం 7గంటలకు స్వామి వారికి జంజంను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్…