వరకట్న వేధింపు తాళలేక ఖానాపూర్ కు చెందిన నూర్జహాన్ అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఆమె ఎంజీఎంలో చికిత్స తీసుకుంటుంది. ప్రేమపేరుతో మోసపోవద్దని వాట్సప్ లో వాయిస్ రికార్డ్ వీడియో వైరల్.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం టీమిండియా క్రికెటర్లు హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ అనంతరం పలువురు టీమిండియా క్రికెటర్లు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇంటికి వెళ్లినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్ రామ్‌చరణ్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మ్యాచ్ గెలుపు సంబరాలను రామ్‌చరణ్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై మరింత సమాచారం తెలియాల్సి…
Hyderabad Metro: ఆదివారం రాత్రి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు నగరంలోని నలుమూలల నుంచి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. క్రికెట్ అభిమానుల కోసం హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ప్రత్యేక ట్రిప్పులు నడిపింది. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు రైళ్లు అందుబాటులో ఉంటాయని గతంలోనే ప్రకటించగా… అభిమానులు ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం…
IND Vs AUS 3rd T20: హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఒకే ఏడాది టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఈ ఏడాది భారత్ 21 టీ20ల్లో గెలిచింది. ఈ మ్యాచ్‌లో 187 పరుగుల లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే భారత్ ఛేదించింది. ఓపెనర్లు రాహుల్ (1), రోహిత్ (17) ఇద్దరూ నిరాశపరిచినా విరాట్ కోహ్లీ (63), సూర్యకుమార్ యాదవ్ (69)…
IND Vs AUS 3rd T20: హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ముందు భారీ స్కోరు నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు తొలి 5 ఓవర్లు, చివరి 5 ఓవర్లలో చెలరేగి ఆడింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 186 పరుగులు చేసింది. ఓపెనర్ కామెరూన్ గ్రీన్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అతడు మొత్తం 52…
Formula E Car Racing: దేశంలోనే తొలిసారిగా ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ 2023లో ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. ఇప్పటికే ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రతినిధులతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ క్రీడా ప్రియుల సమక్షంలో ఫార్ములా ఈ-కార్‌ను హైటెక్ సిటీలోని కేబుల్ బ్రిడ్జిపై ఆవిష్కరించారు. విద్యుత్ ఆధారంగా నడిచే సింగిల్ సీటర్…
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో ఓ మార్పు చేసింది. రిషబ్ పంత్ స్థానంలో భువనేశ్వర్‌ను తీసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఇరు జట్లు చెరొకటి గెలవగా.. నేటి మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. దీంతో ఈరోజు జరిగే మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిరీస్‌ను డిసైడ్ చేసే నిర్ణయాత్మక మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో ఓ మార్పు చేసింది. రిషబ్ పంత్ స్థానంలో భువనేశ్వర్‌ను తీసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఇరు జట్లు చెరొకటి గెలవగా.. నేటి మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌ను కైవసం…