IND Vs AUS: ఆదివారం నాడు హైదరాబాద్‌లో కీలక మ్యాచ్ జరగనుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా చివరి టీ20 కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు శనివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నాయి. ఈ సందర్భంగా తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వీరిని అదుపు చేయడం పోలీసులకు కష్టమైంది. అయినా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. శంషాబాద్ చేరుకున్న అనంతరం టీమిండియా, ఆస్ట్రేలియా టీమ్‌ల…
Team India: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం నాడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 జరగనుంది. ఇప్పటికే మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించగా.. నాగపూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో హైదరాబాద్‌లో జరిగే టీ20లో ఎవరు గెలిస్తే వాళ్లు సిరీస్ కైవసం చేసుకుంటారు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే చరిత్ర సృష్టించనుంది. ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక…
Hyderabad: దేశంలోని అన్ని మెట్రో నగరాలలో భద్రత గురించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరం దేశంలోనే సేఫ్ సిటీగా నిలిచింది. ఈ జాబితాలో రెండో స్థానంలో మహారాష్ట్రలోని పుణే ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2021లో హైదరాబాద్ నగరంలో మొత్తం 2,599 నేరాలు నమోదయ్యాయి. కోల్‌కతా 1,034 నేరాలతో అతి తక్కువ నేరాలు…
అసెంబ్లీలో సీపీఐ ప్రవేశం ఉండాలి… ఆ లక్ష్యంగా పని చేయాలని ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.. సీపీఐ శ్రేణులు పునరుత్తేజంతో పని చేయాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలోనే టీఆర్ఎస్ తో కలిశాం.. సమస్యలు ఎక్కడ ఉంటే సీపీఐ అక్కడ ఉంటుంది.. రాష్ట్రంలో అనేక వర్గాలు సమస్యలతో సతమతమవుతున్నాయి.. అధికార పార్టీకి మద్దతు ఇచ్చినంత మాత్రాన ఉద్యమాలు, పోరాటాల్లో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.. ఇటీవల జరిగిన…
సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు.. అవకాశం దొరికితే ప్రతిష్టాత్మక సంస్థలను కూడా వదలడంలేదు.. తాజాగా, హైదరబాద్ కంచన్‌బాగ్ లోని మిధాని సంస్థకు రూ. 40 లక్షలు టోకరా వేశారు సైబర్ క్రైమ్ నేరస్థులు… మిథాని సంస్థ.. కెనడాకు చెందిన నేచురల్ ఆలూ కంపెనీ దగ్గర నుంచి అల్యూమినియం కొనుగోలు చేసింది.. అయితే, అల్యూమినియం కొనుగోలుకు మిథాని సంస్థ కొంత నగదును అడ్వాన్స్ గా చెల్లించింది… నేచురల్ అలూ కంపెనీ ఒప్పందం ప్రకారం మిథాని సంస్థకు అల్యూమినియం అందించింది……
Yellow Alert for Hyderabad: రాష్ట్రంలో కొద్దిసేపు ఓదార్పు తర్వాత వరణుడి ప్రతాపం మళ్లీ మొదలైంది. సోమవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం కాస్త చల్లబడింది. రాత్రి సమయంలో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఇవాళ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, నగరంలో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే విధమైన వాతావరణం కొనసాగుతుంది.కొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్‌లోని…
తెలంగాణ రాష్ట్రంలో గిరిజన బిడ్డలు ఎస్టీలు.. మహారాష్ట్రలో బీసీలు. ఇంకో చోట ఓసీలు కూడా ఉన్నారు.. ఇలా రకరకాలుగా విభజనలో ఉన్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఉండే గిరిజన బిడ్డలందరికీ సమాన హోదా వచ్చే కార్యక్రమానికి జాతీయ స్థాయిలో మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. హైదారబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లో నూతనంగా నిర్మించిన సేవాలాల్ బంజారా భవన్‌ను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఇవాళ బంజారాహిల్స్‌లో ఇంత చక్కటి…
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో భద్రతా లోపం తలెత్తింది. హరిత ప్లాజా ఎంట్రీ పాయింట్ వద్ద అమిత్ షా కాన్వాయ్కి ఓ కారు అడ్డొచ్చింది. కారు పక్కకి తీయకపోవడంతో అమిత్ షా భద్రతా సిబ్బంది కారు వెనక అద్దం పగలగొట్టారు.