టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి చేసిన వ్యాఖ్యలతో రాజకీయ రచ్చ మొదలైంది. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పలువురు బీజేపీ ఎంపీ ఇంటిని సీజ్ చేశారు.
రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసి తీరని శోకాన్ని మిగిలిస్తున్నాయి. కారు చక్రాల కింద పడి చిన్నారి మృతి, బైక్ ఢీ కొని బాలుడి దుర్మరణం, పలువురికి తీవ్ర గాయాలు ఇలాంటి హృదయవిదారకర వార్తలు మనం తరచూ చూస్తుంటాం. యుద్ధాలలో కన్నా రోడ్డు ప్రమాదాల్లోనే చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువ అంటే అతిశయోక్తి కాదు.
ప్రతిష్టాత్మక రూపొందుతున్న ఫార్ములా ఈ రేస్ పోటీలకు హైదరాబాద్ మహానగరం సిద్ధమైంది. ఫిబ్రవరిలో జరిగే ఈ పోటీల కోసం 35వేల మంది ఒకేసారి వీక్షించే విధంగా ముస్తాబవుతుంది.. ఇది దేశంలోనే తొలిసారిగా నగరంలో నిర్వహిస్తున్న ఈ రేసు కోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా.. పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు.. 2024 ఎన్నికలు కీలకమైనవని పేర్కొన్న ఆయన.. రీజినల్, డెమోక్రటిక్ పార్టీలతో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తాం అన్నారు.. ప్రస్తుత పరిస్థితిపై లెఫ్ట్ పార్టీలు అధ్యయనం చేస్తున్నాయన్నారు.. ఇండియా సెక్యులర్ దేశంఅని.. మరోవైపు దేశ సంపదను బడా పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు.. పేదలను నిత్యావసర ధరలు పెరుగుదల, నిరుద్యోగ సమస్య వేధిస్తోందన్న ఆయన.. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన…
హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. డీఎల్ఆర్ఎల్ రోడ్డుపై కొంతమంది దుండగులు ఓ వ్యక్తిపై కారంచల్లి కత్తులతో పొడిచి హత్య చేశారు.
హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్ బంకుల మోసాలు మళ్లీ వెలుగు చూస్తున్నాయి. పెట్రోల్ తక్కువ వచ్చి, మీటర్ మాత్రం కరెక్ట్‌గా చూపించే విధంగా చిప్స్ అమర్చిన పెట్రోల్ బంక్ నిర్వాహకులు, ఈ ప్రత్యేక చిప్‌ల ద్వారా జనాలని మోసం చేస్తున్నారు.
Meerpet Constable: బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నాడు.. నలుగురికి కష్టం వస్తే తీర్చాల్సిన వాడు.. నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన వాడు.. గాడి తప్పాడు. ఎలాంటి పని అయితే చేయకూడదో అదేపని చేసి అతని వృత్తికే మాయని మచ్చ తెచ్చాడు. రక్షణ కల్పించే రక్షక భటులే తప్పుచేస్తారని ప్రజల మనస్సులో మరింత అపవాదును తీసుకొచ్చాడు ఈ కీచకుడు.
Book Launch: ఆర్ధిక శాస్త్రంలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసిన ఆకిన వెంకటేశ్వర్లు తాజాగా పొలిటికల్ ఎకానమీ ఆఫ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని హైదరాబాద్‌లోని సెస్‌లో మాజీ ప్రణాళిక సంఘం సభ్యుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత సీహెచ్ హనుమంతరావు ఆవిష్కరించారు. ఈ పుస్తకం 572 పేజీలలో 22 అధ్యాయాలుగా విభజించబడింది. ఇందులో ముఖ్య విషయాలన్నీ భారత దేశ వ్యవసాయ రంగం, అభివృద్ధి, ఎత్తుపల్లాల గురించి ఉంటుంది. బ్రిటీష్ వారు భారతదేశ వ్యవసాయాన్ని…
హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాలకు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిస్సింగ్ లింక్స్ ప్రాజెక్ట్స్ (ఫేజ్-III) కింద రూ.2,410 కోట్లతో 104 లింక్ రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది.