చిన్నారులు, యువతులు అనే తేడా లేకుండా.. చదువుకునే ప్రాంతంలోనూ లైంగిక వేధింపులకు గురవుతున్నారు.. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే పాడుబుద్ధి చూపిస్తున్నారు.. బోధనేతర సిబ్బంది కూడా చిన్నారులపై లాంగిక దాడులకు పాల్పడిన ఘటనలు ఎన్నో.. అయితే, వీటిపై దృష్టిసారించిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీబీ ఆనంద్ వెల్లడించారు.. చిన్నారులు, యువతుల రక్షణపై హైదరాబాద్ సీపీ కీలక వ్యాఖ్యలు.. స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిల మీద అఘాయిత్యాలపై ప్రత్యేక చట్టం వస్తుందని.. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తుందని పేర్కొన్నారు.. ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో “నార్కోటిక్స్ ఫ్రీ క్యాంపస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో రాష్ట్ర సర్కార్ ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తుంది.. మేనేజ్‌మెంట్‌ను బాధ్యతగా చేస్తూ చట్టం వస్తుందని.. డీఏవీ స్కూలులో ఘటన తర్వాత చట్టంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీల్లో చిన్నారులు, యువతులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి.. యాంటీ డ్రగ్స్ కమిటీల మాదిరే ఈ చట్టం పనిచేస్తుందని వెల్లడించారు.
Read Also: Students Missing: కృష్ణానదిలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం.. శోకసంద్రంలో కుటుంబసభ్యులు
మన రాష్ట్రానికి ఒక్క డ్రగ్స్ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం.. ముందు తీసుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది.. ఆ తర్వాత దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.. మన పిల్లలు లేటుగా లేవడం గమనిస్తే వారి పట్ల కొద్దిగా శ్రద్ద వహించాలని సూచించారు సీపీ సీవీ ఆనంద్.. ఇక, ఈ డ్రగ్స్ తీసుకోవడంలో అమ్మాయిల శాతం ఎక్కువగా ఉందని.. ఇది కాలేజీ టైంలోనే అలవాటు అవుతుందని.. ఇప్పటి వరకు 34 కళాశాలలో యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.. యాంటీ ర్యాగింగ్ కమిటీలను ఏర్పాటు చేయడం వల్ల ర్యాగింగ్ కొంతవరకు తగ్గిందని.. అందరూ కలిసి దీనిపై పోరాడాలి అని పిలుపునిచ్చారు. ఒక్కొక్క కళాశాలలో యాంటీ డ్రగ్స్ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉండాలి.. దీంట్లో విద్యార్థులు ఉండాలని.. కళాశాలలో పోస్టర్లు పెట్టాలని.. ప్రతీ కళాశాలలో దీనిపై అవగాహన కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఏమైనా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు గమనిస్తే పోలీసులకు తెలియజేయాలి.. సిటీ మొత్తం డ్రగ్స్ ఫ్రీగా మారింది.. దీనిపై చాలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.. ఇది ఇతర రాష్ట్రాలలో నుండి వ్యాపిస్తుంది. దీన్ని చాలా వరకు అరికట్టాం.. గోవాలో చాలా విచ్చల విడిగా డ్రగ్స్ అమ్ముతారు.. అక్కడికి వెళ్లక పోవడం ఉత్తమం అని సూచించారు.. అంత మంది విద్యార్థులను శిక్షించలేం. కాబట్టి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. దీనికి సంబంధించిన డాక్టర్లను సంప్రదించాలి.. ఒక యాక్ట్ తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషన్ సీవీ ఆనంద్..