చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో సమయం వృథా చేసుకోవద్దని ఆర్టీసీ ఎండీ సజ్జానార్ సలహా ఇచ్చారు.
చేగువేరా కుమార్తె డాక్టర్ అలైదా గువేరా హైదరాబాద్‌కు రానున్నారు. కొద్ది రోజుల క్రితం ఆమె దేశ రాజధాని ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ నుంచి వైద్య సేవల కోసం కేరళ వెళ్లాడు. అయితే ఆమె అక్కడి నుంచి బయలుదేరి పలు రాష్ట్రాలను సందర్శించనున్నారు.
Bengaluru and Hyderabad: బెంగళూరు.. హైదరాబాద్.. మన దేశంలోని ఐటీ రంగంలో దూసుకెళుతున్న నగరాలు. ఇది.. నాణేనికి ఒక వైపైతే.. మరో వైపు.. ఈ రెండు సిటీలు సైబర్ నేరాల్లో కూడా లీడింగ్‌లో ఉన్నాయి. 2021వ సంవత్సరంలో మొత్తం 52 వేల 974 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా ఇందులో సగం కేసులు కేవలం కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లలోనే రిజిస్టర్ అయ్యాయి. ఈ లేటెస్ట్ వివరాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది.
నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రధాన పాత్రలో.. గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్రం సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రెండు రోజుల ముందే అభిమానులకు సంక్రాంతి పండుగను తీసుకొచ్చింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్‌ను రిలీవ్ చేస్తున్నట్టు పేర్కొన్న కేంద్రం.. ఆయన్ను ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీలోగా సోమేష్ కుమార్ ఏపీలో రిపోర్టు చేయాలని మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటల్లోనే ఈ ప్రక్రియ పూర్తి అయిపోయింది.. అయితే, సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లే అవకాశం లేదనే వార్తలు…
Free Rice:కొత్త సంవత్సరం వచ్చేసింది.. జనవరి నెల ప్రారంభమై 10 రోజులు గడిచినా.. సంక్రాంతి పండుగ సమీపిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రేషన్ పంపిణీ చేయడం లేదు ఏంటి? అంటూ రేషన్‌కార్డు దారులు అంతా ఎదురుచూస్తున్నారు.. సాధారణంగా 5వ తేదీ నుంచి డీలర్లు బియ్యం పంపిణీ ప్రారంభిస్తారు.. కానీ, ఈ నెల మాత్రం 10వ తేదీ దాటినా బియ్యం పంపిణీ ప్రారంభం కాకపోవడంపై విమర్శలు వెళ్లువెత్తాయి.. ఈ సమయంలో శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. నేటి నుంచి…
జనవరి 19 నుండి దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వత అధిరోహణ చేయనున్న సందర్భంగా మంగళవారం ప్రగతి భవన్ లో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను గిరిజన విద్యార్థిని బానోత్ వెన్నెల మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.