Solar Roof Cycling Track: సైక్లింగ్ ట్రాక్ ఒక ట్రెండ్ సెట్టర్-ఎంపీ రంజిత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Solar Roof Cycling Track: కోకాపేట లే అవుట్ లో రూ.95 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు పక్క గుండా 4.5 మీటర్ల వెడల్పు 23 కిలోమీటర్ల వరకు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సోలార్ రూప్ సైక్లింగ్ ట్రాక్ నిర్మాణపు పనులను పరిశీలించారు చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రె.. నానక్ రాంగూడ నుండి టీఎస్పీఏ వరకు, నార్సింగ్ నుండి కొల్లూరు వరకు ఈ నిర్మాణం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలిపిన ఆయన.. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ఈ సైక్లింగ్ ట్రాక్ ఇండియాలోనే ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోందని పేర్కొన్నారు.. కాగా, పర్యావరణానికి అనుకూలంగా ఉండే.. ప్రజాఉపయోగమైన నాన్ మోటరైజ్ ట్రాన్స్‌పోర్ట్ సెల్యూషన్స్‌ను ఉద్దేశంతో సైక్లింగ్ ట్రాక్ నిర్మాణానికి పూనుకుంది తెలంగాణ ప్రభుత్వం..
Read Also: Kethireddy Pedda Reddy: తాడిపత్రిలో జేసీ సోదరులు బిచ్చం ఎత్తుకోవాల్సిందే..!
Also Read
భారత్‌లో ఇప్పటి వరకు ఎక్కడా ఇలాంటి ట్రాక్‌లు లేవు.. కానీ, హైదరాబాద్‌లో తొలిసారిగా ప్రారంభించారు.. విస్తృతమైన పురోగతి, పట్టణీకరణ జరుగుతుందని, దానికి తగినట్లుగా స్థానికంగా ఉండే యువకులు, ఐటీ రంగాల్లో పనిచేసే వారందరికీ ఇంటి నుంచి ఆఫీస్‌కి, ఆఫీస్ నుంచి ఇంటికి అవసరమైతే బైసైక్లింగ్ చేస్తూ వెళ్లి వచ్చే పద్ధతి ఏర్పాటు చేస్తే బాగుంటుందని, కేవలం ఆఫీస్‌కి వెళ్లికి రాకుండా ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం సైతం బాగుంటుందన్న ఉద్దేశంతో ఇది ప్రారంభించినట్టు గతంలో మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం విదితమే.. ప్రస్తుతం అందరికీ ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెరుగుందని.. 24 గంటలు ఈ ట్రాక్ అందుబాటులో ఉండేలా.. అమ్మాయిలు, అబ్బాయిలు, పిల్లందరికీ ఉత్సాహపరిచేలా భారత్‌లో తొలిసారిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్. జర్మనీ, సౌత్ కొరియా, ఇతర దేశాలకు దీటుగా నాలుగున్నర మీటర్ల వైశాల్యంతో ప్రపంచ స్థాయి నిర్మాణాన్ని చేపట్టారు.. భవిష్యత్ అంతర్జాతీయ సైక్లింగ్ టోర్నీ నిర్వహించేందుకు అనుకూలంగా ఉండేలా నిర్మాణం జరుగుతోంది.. మొదటి దశలో 23 కిలోమీటర్ల మేర 4.5 మీటర్ల వెడెల్పుతో సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ను.. 16 మెగావాట్లతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఏర్పాటు చేస్తున్నారు.. ఈ ఏడాదిలో అందుబాటులోకి తేవాలని హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ లక్ష్యంగా పెట్టుకుని వేగంగా పనులు చేస్తోంది.
Visited the Solar Roof Cycle Track that is currently being developed in #Kokapet today. Inspected the works that are currently underway. Once completed, this first-of-its-kind initiative will surely be a trendsetter in #India.#HappeningHyderabad#CyclingTrack@BRSparty @KTRBRS pic.twitter.com/JrFo0cxWXs
— Dr Ranjith Reddy (@DrRanjithReddy) February 7, 2023
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..