Rajendranagar Horticultural College:రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉద్యాన కాలేజ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాలేజ్ ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అయితే.. ఉద్యాన విస్తరణ అధికారుల నియామకాలను చేపట్టాలని కోరుతూ విద్యార్థులు నిరసనకు దిగారు. కాగా.. ఈ నిరసన గత రెండు రోజులుగా విద్యార్థులు కొనసాగిస్తున్నారు. అయితే విద్యార్థులు నిరసన బాట పట్టడంతో ఉద్యాన యూనివర్సిటీ అధికారులు హాస్టల్, మెస్‌ను మూసివేసినట్టుగా తెలుస్తోంది. విద్యార్థులు హాస్టల్ నుంచి వెళ్లిపోవాలంటూ వైస్ చాన్స్‌లర్ ఒత్తిడి తెస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. దీంతో మండిపడ్డ విద్యార్థులు వైస్ చాన్స్‌లర్ తీరును నిరసిస్తూ యూనివర్సిటీ ముందు విద్యార్థులు నిరసనకు దిగారు. న్యాయం కావాలంటే మెస్, హాస్టల్లు బంద్ చేస్తారా? అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు.
Read also: MLA Shankar Nayak: మానుకోట రాళ్ల రుచి రేవంత్ కు తెలియదు నేను సైగ చేస్తే..
విద్యార్థులు మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ఉద్యాన విస్తరణాధికారుల నియామకాలు జరగలేదని చెబుతున్నారు. తక్షణమే ఉద్యాన విస్తరణాధికారుల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఒక వైస్ చాన్సిలర్ అయి వుండి ఉద్యావనం విస్తరణ గురించి గత మూడు రోజుల నుంచి నిరసన చేస్తున్న అస్సలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి తోడు మెస్, హాస్టల్లు మూసి వేసి హాస్టల్ల నుంచి వెళ్లిపోవాలని అనడం పై నిలదీసిన ఎలాంటి స్పందన లేదని మండిపడుతున్నారు. ఈనేపల్యంలోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా కాలేజ్ లో కి విద్యార్థులు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా కాలజ్ ప్రొఫెసర్లను కూడా విద్యార్థులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో మండిపడ్డ విద్యార్థులు డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఎవరిని లోనికి రానివ్వమని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Top Headlines @9AM: టాప్ న్యూస్