ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతున్నది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పుడు అందరి చూపు ఈవీల వైపునకు మళ్లుతుంది. హీరో రవితేజ రూ. 34.49 లక్షలతో బీవైడీ-ఏటీటీఓ 3 ఎలక్ట్రిక్ కారును తీసుకున్నాడు. ఇప్పుడు అదే బాటలో హీరో అల్లరి నరేశ్ రూ. 64.9 లక్షలతో కియా ఈవీ6 జీటీ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశాడు.
దేశంలోని ప్రధాన నగరాల్లో జనవరి-మార్చ్ త్రైమాసికంలో అద్దెలు భారీగానే పెరిగాయి. హైదరాబాద్, నోయిడా, గురుగ్రామ్, ముంబై, బెంగళూరుల్లో అద్దెలు రికార్డు స్థాయిలో పెరిగాయని తెలిపింది.
హైదరాబాద్ నగరం అన్ని మతాలకు ఆతిథ్యమిచ్చే మహానగరం. ఇక్కడ దేశంలోని అన్ని రాష్ట్రాల వారు జీవిస్తూ ఉంటారు. అందుకే భాగ్యనగరాన్ని మినీ ఇండియా అని అంటారు. హైదరాబాద్ మరో మైలు రాయిని చేరుకుంది.
అబ్దుల్ వహీద్ అనే బాలుడి మృతదేహం ఇంటికి సమీపంలోని నాలాలో కుటుంబ సభ్యులు గుర్తించారు. ఎనిమిదేళ్ల బాలుడు వహీద్ ను ఇమ్రాన్ అనే ట్రాన్స్ జెండర్ హత్య చేసిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా హైదరాబాద్, పాతబస్తీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు.
ఇవాళ ( శుక్రవారం ) నెలవంక కనిపిస్తే శనివారం రంజాన్ పండుగ ఉంటుందని.. లేకపోతే ముస్లింలు ఆదివారం పండుగను జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ ప్రతినిధి ముఫ్తీ మహ్మద్ ఖలీల్ అహ్మద్ చెప్పారు.
హైదరాబాద్ నగరశివారులో IPL బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరాలపై పోలీసుల దాడి చేశారు. ఈ దాడుల్లో 12 మంది నిందితులను అరెస్టు చేయగా.. అందులో ఐదుగురు పరారీలో ఉన్నారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని దుండిగల్ మున్సిపాలిటీ సమీపంలోని బౌరంపేట ఔటర్ రింగు రోడ్డు వద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. రెండున్నర నిమిషాల పాటుగా వీడియోలో పులి సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి.
Today Business Headlines 20-04-23: ‘‘భాగ్య’’మంతుల నగరం: ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్కి చోటు లభించింది. 97 నగరాలతో రూపొందించిన ఈ జాబితాలో హైదరాబాద్కి 65వ స్థానం దక్కింది. నగరంలో ఉంటున్న మిలియనీర్ల సంఖ్య 11 వేల ఒక వంద అని ఈ లిస్టును తయారుచేసిన హెన్లే అండ్ పార్ట్నర్స్ సంస్థ తెలిపింది.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్లో రోబో సాయంతో మొదటిసారిగా మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఆ మేరకు కేర్ హాస్పిటల్ ఓ ప్రకటనలో తెలియజేసింది.