Minister Mallareddy: ఏపీ రాజకీయాలపై మంత్రి మల్లారెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై రాజకీయ పార్టీలు ఇప్పటికే పలుమార్లు పలు ప్రకటనలు చేయడంతో పాటు ప్రత్యేక హోదాను రాజకీయ అస్త్రంగా మలుచుకుంటూనే మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కుల రాజకీయాలు నడుస్తున్నాయని మల్లారెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ శక్తి ఏంటో అందరికీ తెలుసని అన్నారు. పోలవరం కట్టేది కేసీఆర్ అని చెప్పిన మల్లారెడ్డి.. విశాఖ ఉక్కు కూడా నిర్మిస్తామన్నారు. పొరుగు రాష్ట్రాల్లో కేసీఆర్ సీఎం కావాలని మల్లారెడ్డి అన్నారు. కార్మికుల వేతనాలు ఇస్తామని చెప్పి బీజేపీ, కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను తిట్టుతున్నారని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ స్ఫూర్తితో కార్మికులు కాళేశ్వరం, యాదాద్రి, అంబేద్కర్, సచివాలయాన్ని నిర్మించారన్నారు. హైదరాబాద్ లో కార్మికులకు మంచి రోజులు వస్తాయని మల్లారెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల్లో కార్మికులకు అవార్డులు అందజేశారు. బిత్తిరీ సత్తితో కలిసి సినిమా తిస్తున్నానని అన్నారు.
గతంలో మల్లారెడ్డి మాటలు..
ఏపీలో పోలవరం పూర్తి కాలేదని, ఇప్పటి వరకు ప్రత్యేక హోదా సాధించలేదని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ గెలిస్తే కాళేశ్వరం తరహాలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దమ్ము, ధైర్యం కేసీఆర్‌కు ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు కావస్తున్నా పోలవరం ప్రాజెక్టును, అనేక హామీలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయలేదని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా మాట మరిచారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కేసీఆర్ నెరవేరుస్తారని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దమ్ము, ధైర్యం కేసీఆర్‌కు మాత్రమే ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని కాలినడకన తిరుమలకు వచ్చి పూజలు చేస్తున్నానన్నారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ బరిలో ఉంటుంది. దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్ పార్టీకి మంచి స్పందన వస్తోందని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం ఖాయమని మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూడా విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2024లో దేశవ్యాప్తంగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని.. ఏపీతో పాటు ఆయా రాష్ర్టాల్లోనూ మంచి ఆదరణ లభిస్తే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుపై దేశ వ్యాప్తంగా రాజకీయ నేతలు, విశ్లేషకులు ఆలోచిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని, టీఆర్ ఎస్ పార్టీని కేసీఆర్ బీఆర్ ఎస్ గా మార్చారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో మంచి ఆదరణ లభిస్తుందని అంటున్నారు. త్వరలో వివిధ రాష్ట్రాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు.