TV Channel: హైదరాబాద్‌లోని ఓ తెలుగు టీవీ ఛానల్ అర్థరాత్రి అశ్లీల వీడియోలను ప్రసారం కావడం కలకలం రేపింది. అర్ధరాత్రి అకస్మాత్తుగా అసభ్యకర సన్నివేశాలు ప్రసారం కావడం సంచలనంగా మారింది. వీడియోలు చూసిన వారు వెంటనే ఛానెల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన ఛానెల్ సిబ్బంది వీడియో ప్రసారాన్ని నిలిపివేశారు.
వివరాల్లోకి వెళితే… బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 ఎమ్యెల్యే కాలనీలో తెలుగు టీవీ ఛానల్ కార్యాలయం ఉంది. ఈ ఛానెల్ హైదరాబాద్‌తో పాటు అనేక ప్రాంతాల్లో ప్రత్యక్ష ప్రసారాలను అందిస్తుంది. అయితే గత నెల 28వ తేదీ అర్ధరాత్రి ఈ ఛానెల్‌లో హఠాత్తుగా అసభ్యకర వీడియోలు ప్రసారమయ్యాయి. ఆ న్యూడ్ వీడియోలు 15 నిమిషాల పాటు ప్రసారమయ్యాయి. వాటిని చూసిన వారు షాక్‌కు గురయ్యారు. వెంటనే సదరు ఛానెల్ యాజమాన్యానికి సమాచారం అందించి..దీంతో అప్రమత్తమైన యాజమాన్యం ప్రసారాలను నిలిపివేశారు. ఈ ఘటనపై ఛానెల్ నిర్వాహకులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తమది లైవ్ ఛానెల్ అని, అర్థరాత్రి 15 నిమిషాల పాటు అసభ్యకర దృశ్యాలు ప్రసారం చేశారని ఫిర్యాదు చేశారు. తమ సర్వర్‌ను ఎవరో హ్యాక్ చేసి ఉంటారని నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టిక్‌టాక్ స్టార్ ఫోటోలు మార్ఫింగ్.. బ్లూ ఫిల్మ్‌గా మార్చి.. కేసును ఛేదించిన పోలీసులు
ఇదిలా ఉంటే, ఇటీవల బీహార్‌లోని రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై టీవీ ప్రసార ప్రకటనలలో న్యూడ్ వీడియోలు ప్రసారం కావడం కలకలం రేపింది. పాట్నాలోని రైల్వే స్టేషన్‌లో రైళ్ల కోసం వేచి ఉన్న ప్రయాణికులు టీవీల్లో వీడియోలు చూసి షాక్ అయ్యారు. రైల్వేలకు సంబంధించిన ప్రకటనలు, వివరాలకు బదులు పోర్న్ వీడియోలు ప్రసారం చేయడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కేవలం మూడు నిమిషాల పాటు టీవీలో పోర్న్ వీడియో ప్రసారమైంది. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే ప్రసారాలను నిలిపివేశారు. అయితే అప్పటికే కొందరు ప్రయాణికులు ఈ ఘటనను తమ సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
Chikoti Praveen: మళ్లీ దొరికిన చికోటి ప్రవీణ్.. ఈసారి థాయిల్యాండ్‌లో..