ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవం, అనంతరం పరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు.
హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎండలు పెరిగాయి. దీంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు లేదా మెరుపులతో తేలికపాటి నుండి మోస్తరు చెదురుమదురు వర్షాలు కురుస్తాయి.
తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల దళిత మేధావులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ఆవిష్కరించనున్నారు.
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కావడంతో నగరవ్యాప్తంగా అత్తర్ విక్రయించే దుకాణాలు భారీగా వెలుస్తున్నాయి. ప్రజలు తమ చేతులకు అత్తర్ను పూయడం, అత్తర్ సరైనదాన్ని ఎంచుకోవడానికి సువాసనను చూసి నచ్చిన అత్తర్ ను ఎంచుకుంటుంటారు.
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 8వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ప్రధాని రాకను పురస్కరించుకుని పలు రైల్వే అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్దమవుతోంది.
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల నియంత్రణకు ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ సూచించిన సూచనల అమలుకు చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.
మూడేండ్ల నిరీక్షణకు తెరదించుతూ.. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగనుంది. క్రికెట్ ప్రేమికులు ఆసక్తికర మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉప్పల్ లో జరిగే తొలి మ్యాచ్ లో హైదరాబాద్ బోణి కొట్టాలని కోరుకుంటున్నారు.