అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తోంది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ దేశవ్యాప్తంగా ఎంతో పేరు సంపాధించింది. ఓవైపు అభివృద్ధి మరోవైపు పరిశ్రమల ఏర్పాటుతో హైదరాబాద్ పేరు మార్మోగుతోంది. నగరంలో సుందరీకరణ కోసం అనేక చర్యలు తీసుకుటోంది ప్రభుత్వం.
శ్రీరామ నవమి శోభా యాత్ర నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీరామనవమి సందర్భంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయని తెలిపారు.
పేద ప్రజల కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఎర్రమంజిల్ స్థలం మొత్తం నిమ్స్ కి ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని మంత్రి హరీశ్ రావ్ అన్నారు. నిమ్స్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎం.సి.హెచ్ ఆసుపత్రికి ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు, మంత్రి తలసాని భూమి పూజ చేశారు.
తెలంగాణ రాధాజని హైదరాబాద్ లో వేసవి తాపం మొదలైంది. నిన్న మొన్నటి వరకు వర్షాలతో వాతావరణ చల్లగా ఉంది. అయితే, రాబోయే రోజుల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Rains – Yellow Alert: ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.. తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి.. అయితే, మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.. ఈ రోజు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.. తమిళనాడు నుంచి కర్ణాటక, మరఠ్వాడ, విదర్భ, మధ్యప్రదేశ్ మీదుగా బిహార్ వరకు ద్రోణి విస్తరించి ఉంది.. దీని ప్రభావంతో సముద్రం…
సీఎం కేసీఆర్ ఆదేశాలతో వరంగల్, నాందేడ్ నేషనల్ హైవే లపై రూ.18.61 కోట్ల వ్యయంతో పూలబాటలు పూర్తి చేసింది హెచ్ఎండిఏ. రూ.15.04 కోట్ల వ్యయంతో వరంగల్ హైవే (NH-163) వెంట 64 కిలోమీటర్లు, రూ.3.57 కోట్ల వ్యయంతో నాందేడ్ హైవే (NH-161) వెంట 33 కిలోమీటర్ల సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీ లేయర్ ప్లాంటేషన్ పనులు పూర్తి చేశారు.