Nehru Zoo Park: తెలంగాణ ప్రభుత్వం పర్యాటకులకు షాక్ ఇవ్వనుంది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన నెహ్రూ జూ పార్క్ టిక్కెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జూపార్క్ టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జూపార్క్ టికెట్ ధర సాధారణ రోజుల్లో పెద్దలకు రూ.70, పిల్లలకు రూ.45కి పెంచనుంది. సెలవులు, వారాంతాల్లో పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.55 చొప్పున టిక్కెట్ ధరలను పెంచాలని నిర్ణయించారు.
గతంలో సాధారణ రోజుల్లో పెద్దలకు రూ.60, వారాంతాల్లో, సెలవు రోజుల్లో రూ.75గా ఉండేది. పిల్లలకు టిక్కెట్ ధర సాధారణ రోజుల్లో రూ.40, వారాంతాల్లో, సెలవు దినాల్లో రూ.50గా ఉండేది. పెంచిన టిక్కెట్ ధరలను త్వరలో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎప్పటిలోగా పెంచుతారనే దానిపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. వేసవి దృష్ట్యా, జంతుప్రదర్శనశాల రద్దీగా ఉంటుంది. విద్యాసంస్థలకు సెలవు కావడంతో పిల్లలను జూపార్కుకు తీసుకెళ్తారు. వేసవి కాలం కావడంతో చల్లదనాన్ని ఆస్వాదించేందుకు, వివిధ రకాల పక్షులు, జంతువులను చూసేందుకు చాలా మంది సందర్శకులు జూకు వస్తుంటారు.
Read also: Jeans : మా తల్లే.. ఉతికితే చిరిగిపోద్దని 18ఏళ్లు ఒకటే జీన్స్ వేసుకున్నావా
సందర్శకుల తాకిడితో ఆదాయం పెరుగుతుందని అటవీశాఖ భావిస్తోంది. అందులో భాగంగానే టిక్కెట్ ధరలను పెంచినట్లు తెలుస్తోంది. టిక్కెట్ ధరల పెంపుపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇటీవల జూ పార్క్ అథారిటీతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జూపార్క్ టిక్కెట్ల ధరల పెంపుపై చర్చలు జరిగాయి. పార్కు నిర్వహణ, సిబ్బంది వేతనాలు మెరుగుపరచడంతోపాటు పార్కును మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ప్రవేశ టికెట్ ధరలను పెంచాలని నిర్ణయించారు.
తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ జూ నడుస్తోంది. దేశంలోని అతిపెద్ద పార్కుల్లో ఇది కూడా ఒకటి. పార్కులో అన్ని రకాల పక్షులు, జంతువులు మరియు పాములు ఉన్నాయి. దాదాపు 380 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ పార్క్ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఈ పార్కులో దాదాపు 1500 రకాల జంతువులు ఉన్నాయి. ఈ జూ పార్క్ 1963లో ప్రారంభించబడింది. జూలోని టైగర్ జోన్‌లోకి ప్రవేశించడానికి, ప్రవేశ టిక్కెట్‌తో పాటు ప్రత్యేక టిక్కెట్‌ను కొనుగోలు చేయాలి. లోపల క్యాంటీన్లలో ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు జూకు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గినా.. మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు ప్రారంభమైతే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. శని, ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. టిక్కెట్ ధరల ద్వారా రాష్ట్ర అటవీశాఖకు కూడా భారీగా ఆదాయం వస్తోంది.
Neera cafe: హైదరాబాద్‌కు మరో అదనపు ఆకర్షణ.. సాగర తీరంలో నీరా కేఫ్