Karnataka Election: కర్నాటకలో ఎన్నికలు.. తెలుగు రాష్ట్రాల్లో వందల కోట్ల బెట్టింగ్‌లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Election: కర్నాటక ఎన్నికల్లో గెలుపోటములపై తెలుగు రాష్ట్రాల్లో వందల కోట్ల బెట్టింగ్ లు జరుగుతున్నాయి. విషయం ఏదైనా సరే పందెం కట్టడం అలవాటైన తెలుగు పందెం రాయుళ్లు.. కర్నాటక ఎన్నికలనూ వదలడం లేదు. ప్రచారం ప్రారంభం కాక ముందు నుంచే మొదలైన పందేలు.. ఇప్పుడు పీక్స్ కు చేరాయి. పోటాపోటీ ప్రచారం సాగడంతో పందెం రాయుళ్లు వ్యూహాలు మార్చుకుంటున్నారు.
గత నెలలో కాంగ్రెస్ కు వంద నుంచి 103 సీట్లు వస్తాయని మొదలైన పందేలు ఇవాళ్టికి 114-116 మధ్య వస్తాయని బెట్టింగ్స్ వేస్తున్నారని సమాచారం. బీజేపీకి వంద సీట్లు వస్తాయని మొదట్లో జరిగిన పందేలు ప్రస్తుతం 80-82 వస్తాయని జరుగుతున్నాయి. జేడీఎస్ కు మొదటి నుంచి 21-23 మధ్యే సీట్లు వస్తాయని బెట్టింగ్స్ వేస్తున్నారు. రూపాయికి రూపాయి చొప్పున ఈ బెట్టింగ్స్ ఉంటున్నాయి. బెట్టింగ్ లకు కేంద్రమైన భీమవరం లో కోట్లలో లావాదేవీలు నడుస్తున్నాయని చెబుతున్నారు.
Also Read
- Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే 'సన్న కారపూస'.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
- Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే 'మోతిచూర్ లడ్డు'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
- IND vs NZ: ఆక్లాండ్‌లో 'కింగ్' షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
- AI Smart Helmets: ఏఐ టెక్నాలజీతో 3 స్మార్ట్ హెల్మెట్లు.. ఫీచర్స్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
మొదటి నుంచి బీజేపీ వెనుకబడి ఉందనే అంచనాల్లో కొందరు ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం తర్వాత మొత్తం సీన్ మారిపోయిందంటూ.. బెట్టింగ్ చేస్తున్నారు. కర్నాటకలో ఎలాగైతే పోటాపోటీగా ఉందనే అంచనాలు వస్తున్నాయో.. బెట్టింగ్ లు కూడా అంతే పోటాపోటీగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని కొంపల్లి, కూకట్ పల్లి, గచ్చిబౌలీ ప్రాంతాల్లో జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నాయి. పోలింగ్ సరళిని బట్టి కూడా బెట్టింగ్ లలో ఎత్తులు మారిపోనున్నాయి. అంతేకాదు.. కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కూడా బెట్టింగ్స్ జరుగుతుంటాయి. గతంలో జరిగిన దుబ్బాక, హుజూర్ నగర్, మునుగోడు లలో కోట్లాది రూపాయల పందేలు నడిచాయి. అవే బ్యాచ్ లు ఇప్పుడు కర్నాటక ఫలితాలపై పందేలు కాస్తున్నారు.
తాజావార్తలు
-
Reasons Behind Republican Defeat: ఇరాన్ వార్ నుంచి అభ్యర్థుల ఫెయిల్యూర్ దాకా.. ట్రంప్ పార్టీ ఓటమికి అసలు కారణాలివే!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Food Safety Raids : మిఠాయిల్లో బొద్దింకలు, ఈగలు.. నిజామాబాద్‌లో 13 సంస్థల లైసెన్సులు రద్దు
-
Mahabubabad Mortuary Incident: బతికుండగానే మార్చురీలో పెట్టిన ఘటన.. ఏడాది తర్వాత మళ్లీ విచారణ
-
Jayasudha: ‘మీరు – నేను కలిసి నటిద్దాం.. టైటిల్ రోమన్ హాలిడే!’.. అల్లు అరవింద్‌కు జయసుధ క్రేజీ ప్రపోజల్
ట్రెండింగ్
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!