Minister KTR: హైదరాబాద్ లో సమస్యలు ఉన్నాయి.. ఇంకా ఉంటాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బేగంపేటలోని ధనియాలగుట్టలో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన వైకుంఠ ధామాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ అంతా మారిపోయింది. భూతల స్వర్గం అయిపోయిందని తాను చెప్పట్లేదని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో సమస్యలు ఉన్నాయి.. ఇంకా ఉంటాయని అన్నారు. మనిషి భూమిపై ఉన్నంత కాలం సమస్యలు ఉంటాయి. అమెరికాలో ఉండే సమస్యలు అక్కడ ఉన్నాయని అన్నారు. కనీసం మౌలిక సదుపాయాలు, విద్యుత్, నీరు తదితర అవసరాలు కల్పించాలని తెలిపారు. వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. సమర్థ నాయకుడు కేసీఆర్ వల్లనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. మంచి నాయకులను, ప్రభుత్వాలను కాపాడుకోవాలని సూచించారు. కేసీఆర్ ను మూడోసారి గెలిపించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కేటీఆర్ అన్నారు. ఈ నిర్మాణాన్ని ఆపడానికి చాలా మంది ప్రయత్నించినా, ఇంత అందమైన వైకుంఠధామం స్థాపించబడింది.
Read also: Revanth Reddy: అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన హామీకే దిక్కులేదు..!
జూబ్లీహిల్స్‌లో మహా ప్రస్థానం అని కట్టారు. అంతకంటే అద్భుతంగా ఉందని గర్వంగా చెప్పుకుంటామని కేటీఆర్ అన్నారు. ఒక నగరం కాస్మోపాలిటన్ నగరంగా ఎదగాలంటే అద్భుతమైన ఫ్లై ఓవర్లు మరియు ప్రజా రవాణా ఉండాలి. దానితో పాటు 24 గంటల కరెంట్ ఉండాలి. మంచినీటి సరఫరా ఉండాలి. చెరువులు, కాలువలకు మరమ్మతులు చేపట్టాలి. ఈ 9 ఏళ్లలో మనమంతా గర్వపడే విధంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దామా..? లేదా..? దీనిపై అందరూ ఆలోచించాలని కేటీఆర్ సూచించారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని కేటీఆర్ తెలిపారు. లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టించామన్నారు. ఈ నాలుగు నెలల్లో అందజేస్తాం. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాం. కులం, మతం లేకుండా ముందుకు సాగుతున్నాం. ఎయిర్‌పోర్టు దాకా మెట్రోను తీసుకువెళుతున్నామని తెలిపారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. మాటలు తిట్టడం ఈజీ.. కానీ మాకు కూడా తిట్లు వస్తాయి. అయితే ప్రజలకు ఏం చేశామన్నదే ముఖ్యం. బీజేపీ నేతలు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. హైదరాబాద్ వదర బాధితులకు తెలంగాణ ప్రభుత్వం రూ. 660 కోట్ల సాయం చేయలేదు. కనీసం ఆరు పైలు కూడా కేంద్రం సాయం చేయలేదన్నారు కేటీఆర్. ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం మీ కోసం హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. పెట్టుబడులు వస్తున్నాయి. అందుకు రాజకీయ సుస్థిరతే కారణమని కేటీఆర్ పేర్కొన్నారు.
Zero Shadow day: మీరు చూశారా.. హైదరాబాద్‌లో నీడ మాయం