Malakpet MMTS: దేశవ్యాప్తంగా రైల్వేలో ఇటీవల చోటుచేసుకుంటున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఒడిశాలోని బాలసోర్ దుర్ఘటన తర్వాత ఏ చిన్న ప్రమాదం చోటుచేసుకున్న జనాలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య.. బెంగాల్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ.. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు మరింత కలవరానికి గురయ్యారు. రైళ్లల్లో ప్రయాణించాలంటేనే జంకుతున్నారు. ట్రైన్ జర్నీ చేసేప్పుడు ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అంటూ భయాందోళన చెందుతున్నారు. ఇక తాజాగా రెండు ఎంఎంటీఎస్ ట్రైన్ ఒకే ట్రాక్ మీదికి రావడంతో ప్రయాణికులు షాక్ కు గురయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ లోని మలక్ పేటలో చోటుచేసుకుంది.
Read also: Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు షాక్.. పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు..
తాజాగా హైదరాబాద్ మలక్‌పేట రైల్వేస్టేషన్ సమీపంలో రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఒకే ట్రాక్‌పై రావడం తీవ్ర కలకలం రేపింది. రెండు ఎంఎంటీఎస్ రైళ్లు కూడా ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా వచ్చాయి. అయితే అప్రమత్తమైన లోకో పైలట్లు రెండు రైళ్లను ఆపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు అరగంట పాటు రెండు రైళ్లను ట్రాక్స్ పైనే నిలిపివేశారు. ఆ తర్వాత రూట్ క్లియర్ చేసి ఓ రైలును మరో ట్రాక్ పైకి మళ్లించారు. అయితే రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి ఎలా వచ్చాయనే దానిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
TS High Court: వనమా పై అనర్హత వేటు.. కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు..