Hyderabad: ఇటీవల హైదరాబాద్‌లో కొందరు మందుబాబులు బరితెగిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో బహిరంగంగా మద్యం సేవిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్లతో పాటు నడిరోడ్డుపై మద్యం సేవించి వీరంగం సృష్టిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, పొగతాగడం నిషిద్ధమని తెలిసి కూడా కొందరు అతిగా ప్రవర్తిస్తున్నారు. తమను ఎవరూ పట్టించుకోరనే ధైర్యంతో ఇలాంటి పనులు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా పంజాగుట్ట మెట్రో స్టేషన్ సమీపంలో ఇద్దరు మందు బాబులు మద్యం సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.. ఇక తాజాగా హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ భవనం ఎదురుగా ఉన్న ట్రాఫిక్ బూత్ లో ఇద్దరు యువకులు మద్యం సేవిస్తున్నారు. సిగ్నల్ వద్ద పేవ్ మెంట్ పై ట్రాఫిక్ కానిస్టేబుళ్ల కోసం ఏర్పాటు చేసిన బూత్ లో కూర్చోని హాయిగా కుర్చీల్లో కూర్చొని మద్యం తాగుతున్నారు. మార్గమధ్యలో ఉన్న ఈ బూత్‌లో ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, సిగ్నల్స్‌ను నియంత్రించడం వంటి పనులు చేస్తుంటారు. కాగా.. ట్రాఫిక్ బూత్ లో ఇద్దరు వ్యక్తులు కూర్చోవడమే కాకుండా.. బహిరంగంగా మద్యం సేవించడం వివాదాస్పదంగా మారింది.
Read also: Bro Pre Release Event: దెబ్బకు రీ సౌండ్ రావాలి ‘బ్రో’…
శనివారం రాత్రి ఈ ఘటన జరగడంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు వారి చేష్టలను తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు వైరల్‌గా మారింది. వీడియోలో, వాహనదారులు మద్యం సేవిస్తూ రోడ్డు పక్కన ప్రయాణిస్తున్నారు. పోకిరీలు మందు కొట్టేందుకు ట్రాఫిక్ బూత్ అడ్డంకిగా మారినా.. పోలీసులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్లకు కూడా అనుసంధానం చేస్తారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు గమనించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ట్రాఫిక్ పోలీసులకు కేటాయించిన బూత్‌లో కూర్చోకుండా బహిరంగంగా మద్యం సేవించడం ఇదే తొలిసారి కాదు. ఇలాంటి వీడియోలు గతంలో చాలా సార్లు వైరల్ అయ్యాయి. నగరం నడిబొడ్డున అత్యంత రద్దీగా ఉండే హైటెక్ సిటీ జంక్షన్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో హల్ చల్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం పంజాగుట్ట మెట్రో స్టేషన్ సమీపంలో కొందరు వ్యక్తులు మందు తాగుతూ కనిపించారు. మెట్రో స్టేషన్ కు కొద్ది దూరంలోనే వైన్ షాప్ ఉండడంతో మందు బాబులు అక్కడే మద్యం కొనుగోలు చేసి పక్కనే ఉన్న మెట్రో స్టేషన్ లో తాగుతున్నారు. తాజాగా ఈ వీడియోను మంత్రి కేటీఆర్‌కు కొందరు నెటిజన్లు ట్విట్టర్‌లో ట్యాగ్ చేశారు.
Pawan Kalyan: ఇది ‘బ్రో’ పవర్ స్టార్ క్రేజ్!