తెలంగాణలో పాలిటిక్స్ మంచి రసవత్తరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం గట్టిగానే నడుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మీద రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా.. కరెంట్ వెలుగుల బీఆర్ఎస్ పార్టీ కావాలో తెలంగాణ రైతులే తెల్చుకోవాలని ఆయన సూచించారు.
మేడ్చల్ జిల్లాలోని శామీర్ పేట మండలం బొమ్మరాజుపేట రైతులకు మద్దతుగా శామీర్ పేట పోలీస్ స్టేషన్ కు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ వెళ్లారు. 50 ఏళ్ల క్రితం కొనుక్కున్న 1,050 ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నారని.. కేసీఆర్ బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తున్నారని రైతులు ఆందోళన చేస్తున్నారు.
Shani Trayodashi: శని త్రయోదశి నాడు ఈ అభిషేకం వీక్షిస్తే సర్వదోషాలు, సకల పాపాలు సర్వనాశనమైపోతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి.
ఈ రోజు శని త్రయోదశి.. హైందవ సంప్రదాయం ప్రకారం- త్రయోదశితో కలిసి వచ్చిన శనివారాన్ని శని త్రయోదశిగా పిలుస్తారు. శనీశ్వరుడిని ఆరాధించడం, తైలాభిషేకం చేయడం వల్ల సర్వ దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం..
మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసి ఉంచాలని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. వచ్చే ఆదివారం హైదరాబాద్‌లో బోనాల పండుగ నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Hyderabad Rain Alert: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. మరో రెండు రోజుల పాటు కురుస్తాయని ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష హెచ్చరిక జారీ చేసింది.
టీచింగ్ ఆసుపత్రుల్లో 190 అసిస్టంట్ ప్రొఫెసర్ పోస్టులను అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతులు కల్పించే ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలి అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కౌన్సిలింగ్ పూర్తి చేసి వెంటనే పోస్టింగ్ లు ఇవ్వాలి అని ఆయన పేర్కొన్నారు. ప్రొఫెసర్ నుంచి అడిషనల్ డీఎంఈగా పదోన్నతి పొందేందుకు వీలుగా వయోపరిమితి 57 ఏళ్ల నుంచి 64 ఏళ్లకు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నాడు.
Secret Camera: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఓ ఇంటి యజమాని దారుణానికి ఒడిగట్టాడు. ఇంటిని అద్దెకు ఇచ్చి ఇంట్లో రహస్య కెమెరాను అమర్చాడు. గదిని అద్దెకు తీసుకున్న యువతులు ఈ విషయాన్ని గుర్తించడంతో అతడి వికృత రూపం బయటపడింది.