తెలంగాణలో పెండింగ్ బిల్లుల వ్యవహారంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గత కొద్దిరోజులుగా విభేదాలు కొనసాగుతునే ఉన్నాయి. పలు బిల్లులను గవర్నర్ పాస్ చేయలేదని తెలంగాణ సర్కార్ ఏకంగా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. మొత్తం 10 బిల్లులకు గాను.. గవర్నర్ కేవలం మూడు బిల్లులకు మాత్రమే ఆమోదం తెలిపారు. రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా.. మరో రెండు బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ అడిగారు.. మిగిలిన మూడు బిల్లుల్లో ఒక బిల్లును గవర్నర్ తమిళిసై తిరస్కరించింది. మరో రెండు బిల్లులపై అదనపు వివరణ కోసం తిరిగి తెలంగాణ సర్కార్ కే పంపించారు. దీంతో గవర్నర్ తీరుపై ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
అయితే, ఈ క్రమంలో తాజాగా పెండింగ్ బిల్లులపై గవర్నర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికి వ్యతిరేఖం కాదు అని ఆమె అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన బిల్లులను వెనక్కి పంపడంపై నా అభ్యంతరాలను క్లియర్ గా తెలిపాను అన్నారు. వెనక్కి పంపిన బిల్లులపై స్పీకర్ కు వివరాలు కావాలని అడిగాను.. మూడు బిల్లులకు నేను, ఆమోదం తెలిపాను అని గవర్నర్ అన్నారు. తెలంగాణ ప్రజలతోనే నేను ఉన్నాను అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. అకాల వర్షాల వల్ల తెలంగాణ ప్రజలు ఇబ్బందులు బాధకలిగించాయి.
Read Also: Paneer Side Effects : టేస్ట్ బాగుంది కదా అని కుమ్మేస్తున్నారా? ఇది మీకోసమే..
వరదల్లో చిక్కుకున్న ప్రజలను చూస్తుంటే బాధేస్తోంది అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రభుత్వం మరింత మెరుగ్గా ప్రజలకు రక్షణగా ఉండాల్సింది. ప్రజాప్రతినిధులు ప్రజలకు అండగా ఉండాలి- రిమోట్ ఏరియా ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు అని ఆమె పేర్కొన్నారు. వర్షాలపై కొన్ని రాజకీయ పార్టీలు నాకు మెమోరాండం ఇచ్చాయి.. హైదరాబాద్ జల్పల్లి ఏరియా వర్షాలు వల్ల పూర్తిగా ఎఫెక్ట్ అయింది.. నీట మునిగిన ప్రజలకు ప్రభుత్వం అండగా ఉండాలి.. నేను ప్రభుత్వాన్ని నివేదిక అడిగాను- రాగానే కేంద్రానికి పంపుతా.. ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన ప్రాంతాల్లో నేను త్వరలో పర్యటిస్తాను అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.