హైదరాబాద్ లో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపుతోంది. తిలక్ నగర్లో 15 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయింది. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పేద ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ్టి నుంచే హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను అర్హులైన వారికి అందజేస్తామని వెల్లడించారు.
రాజ్ భవన్ - ప్రగతి భవన్ మధ్య దూరం పెరగడమే కారణమని తెలుస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా 120 మంది ఖైదీల విడుదల జాబితాను తెలంగాణ జైళ్ల శాఖ ఉన్నతాధికారులు హోంశాఖకు పంపించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి రెండు సార్లు క్షమాభిక్షలు ప్రసాదించింది. వందలాది మంది జీవిత ఖైదీలు విడుదల కాలేకపోవడం వల్ల 35 సంవత్సరాలుగా జైళ్ల నాలుగు గోడల మధ్య ఖైదీలు నలిగిపోతున్నారు.
ప్రజా యుద్ధనౌక, గాయకుడు గద్దర్ నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లి.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రబాబు వెంట టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, రావుల చంద్రశేఖర్ రెడ్డితో పాటు తదితరులు ఉన్నారు.
Pragati Bhavan: ప్రగతి భవన్లో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు.
బతుకమ్మ సంబరాలకు భారత్ జాగృతి సన్నాహాలు మొదలు పెట్టింది. భారత్ జాగృతి ఆధ్వర్యంలో రాబోతున్న బతుకమ్మ పాటకు సంబంధించిన ఒక వీడియోను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.
రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ముందు గులామ్ హుస్సేన్ కుటుంబ సభ్యుల ధర్నాకు దిగారు. గత 17 రోజుల క్రితం అత్తాపూర్ గోల్డన్ ప్యాలెస్ హోటల్ దగ్గర శవమై తేలిన గులామ్ హుస్సేన్ ను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు అని వారు ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్ పై అభిప్రాయాలను తీసుకోవడానికి గాంధీభవన్ కు మంద కృష్ణ మాదిగ బృందం వెళ్లింది. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో పాటు పలువురు పార్టీ నేతలతో మంద కృష్ణ సమావేశం అయ్యారు. ఎస్సీలలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ నాయకులకు ఆయన వినతిపత్రాలు ఇచ్చారు.