సరిసాటిలేని సౌందర్యానికి కూడా కొత్త అందాలు తెచ్చే 'ఇల్బుమినా' అనే ఒక అపూర్వమైన విభాగానికి తెలంగాణా రాష్ట్ర పోలీస్ శాఖ, మహిళా భద్రతా విభాగం డిఐజి - శ్రీమతి సుమతి బడుగుల - ఈనాడే హైదరాబాద్‌లోని నానక్ రామ్ గూడా స్టార్ హాస్పిటల్స్ లో శుభారంభం చేశారు.
తెలంగాణ ప్రభుత్వ బిజినెస్ రూల్స్- సెక్రటేరియట్ సూచనలకు అనుగుణంగా, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి స్వీకరించడం) బిల్లు-2023తో సహా రాష్ట్ర శాసనసభ కార్యదర్శి నుంచి అందిన అన్ని బిల్లులు చట్ట కార్యదర్శికి సిఫార్సు చేయబడ్డాయి.
హైదరాబాద్ నగర శివారులోని శంకర్ పల్లి మండలం మోకిల గ్రామంలో ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మోకిల లేఅవుట్ ప్లాట్లకు మస్తు డిమాండ్ నెలకొంది.
జూపల్లి కృష్ణారావు అంత పెద్దోడు ఎప్పుడు అయ్యాడో నాకు అర్థం కాలేదు అని మాజీ మంత్రి నాగం జనార్థర్ రెడ్డి అన్నారు. ఇక్కడ గెలిచినోడు ఇక్కడే ఉంటాడు అని గ్యారంటీ ఎవరు ఇస్తారు.. నాగర్ కర్నూల్ నుంచి పోటీ ఎవరు చేస్తారన్న విషయం పార్టీ నిర్ణయిస్తుందని నాగం చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపైన కేటీఆర్ విస్తృతంగా చర్చించారు.
రాయ్‌పూర్‌కు చెందిన 90 ఏళ్ల వృదుడికి క్వాడ్రాపూల్ బైపాస్సర్జరీని విజయవంతంగా నిర్వాయించినట్లు కేర్ హస్పిటల్ బంజారాహిల్స్‌లోని కార్డియాక్ సర్జరీ డైరెక్టర్ ప్రతీక్ భట్నాగర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణలో జులై 1న నిర్వహించిన గ్రూప్-4 ఫలితాలపై టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి కీలక అప్ డేట్ ఇచ్చారు. గ్రూప్-4 రిజల్ట్స్ కు ఇంకా సమయం ఉందని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ లో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపుతోంది. తిలక్ నగర్లో 15 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయింది. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.