తెలంగాణలో ఎన్నికల హడావుడి నడుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి. ఎలాగైనా ఈసారి బీఆర్ఎస్‌ను ఓడించి.. తాము అధికారం దక్కించుకోవాలని విపక్ష పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ వ్యూహాలకు పదను పెడుతూ ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగానే.. గెలుపు గుర్రాల వేట స్టార్ట్ చేశాయి. మొన్న కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల టికెట్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా విశేష స్పందన వచ్చింది. అర్హులైన ఆశావాహుల పేర్లతో జాబితాను.. సీల్డ్ కవర్‌లో ఏఐసీసీకి పంపింది. కాగా.. ఇప్పుడు బీజేపీ కూడా కాంగ్రెస్ దారిలోనే నడుస్తోంది. ఔత్సాహికుల నుంచి అప్లికేషన్లను ఆహ్వానించగా.. కమలం పార్టీకి భారీ స్పందన వచ్చింది.
Read Also: Sonal Chauhan : బికినీ లో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న బాలయ్య బ్యూటీ..
అయితే.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రధాన పక్షంగా ఉండటంతో పాటు ఉమ్మడి ఏపీలో చక్రం తిప్పిన కీలక నేతలంతా తెలంగాణకు చెందినవాళ్లే.. ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న చాలా మంది నేతలు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకొచ్చారు. కానీ.. తెలంగాణలో చాలా తక్కువ కేడర్ ఉన్న కమలం పార్టీకి కూడా ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. తెలంగాణలో కేవలం ముగ్గురంటే ముగ్గురే ఎమ్మెల్యేలున్న కమలం పార్టీకి.. 119 స్థానాల్లో నిలబెట్టేందుకు అభ్యర్థులు కూడా లేరంటూ అధికార పార్టీ నేతలు విమర్శించారు. అలాంటిది ఇప్పుడు పోటీకి నిలబడేందుకు భారీగా ఆశావాహులు అప్లికేషన్లు పెట్టుకున్నారు.
Read Also: Srinidhi Shetty : లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీనిధి శెట్టి.. స్టార్ హీరో సరసన ఛాన్స్..
ఇక, బీజేపీ పార్టీ ఈ నెల 4న ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. నిన్న ( 10 సెప్టెంబర్ ) సాయంత్రం 4 గంటల వరకే దరఖాస్తు చేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది. అయితే.. దరఖాస్తులకు బీజేపీ ఫీజు పెట్టకపోవటంతో చాలా మంది అప్లికేషన్స్ చేసుకున్నారు. అయితే.. నిన్న ( ఆదివారం ) ఒక్కరోజే ఏకంగా 2781 మంది మంది ఆశవాహులు అప్లయ్ చేశారు. దీంతో.. బీజేపీ ఎమ్మెల్యే టికెట్ కోసం వచ్చిన మొత్తం దరఖాస్తులు సంఖ్య 6003కు చేరింది. దీంతో.. బీజేపీకి తెలంగాణలో ఫుల్ డిమాండ్ ఉంది. బీజేపీ తరఫున పోటీ చేసేందుకు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.