హైదరాబాద్ లో నకిలీ ట్రాన్స్ జెండర్ల బెగ్గింగ్ మాఫియాలో కొత్తకోణం వెలుగులో వచ్చింది. రాజేష్, అనితలు కలిసి నకిలీ ట్రాంజెండలను తయారు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. రాజేష్, యాదవ్ ల దగ్గర వంద మందికి పైగా నకిలీ ట్రాన్స్ జెండర్.. ఉదయం నుంచి సాయంత్రం వరకు చౌరస్తాలో బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు.
తెలంగాణాలో 54 శాతం బీసీలు ఉన్నాం.. ప్రత్యేక మంత్రి శాఖను కేటాయించాలని సీఎం కేసీఆర్ ను కోరామని పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంత రావు అన్నారు. అయినా, కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు అని ఆయన ఆరోపించారు. బీసీ గర్జన నిర్వహణ కోసం బీసీలను చైతన్యం చేసేందుకు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.. దీన్ని క్షేత్ర స్థాయికి తీసుకెళ్ళాను అని వీహెచ్ పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల ముందు నిర్ణయించిన దిశా మీటింగ్కు అధికారులు హాజరు కాకపోవడంపై ఆయన మండిపడ్డారు.
మహిళా ప్రయాణికులకు తెలంగాణ స్టేట్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో గుడ్ న్యూస్ చెప్పింది. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును టీ.ఎస్.ఆర్టీసి ఏర్పాటు చేసింది. 127K నంబర్ బస్సు మహిళల కోసం ప్రత్యేకంగా నడిపిస్తున్నారు. లేడీస్ స్పెషల్ బస్సు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా చెప్పారు.
ఇందిరాపార్క్ దగ్గర సెకండ్ ఎఎన్ఎమ్ ల ధర్నాకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు. ధర్నాను ఉద్దేశించి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రంలో కాంట్రాక్ట్ ఎఎన్ఎమ్ లను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తున్నారు..
నేను మల్కాజ్ గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని బీజేపీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి మురళిధర్ రావు అన్నారు. కేసీఆర్ స్ట్రాటజీ మిస్ అవుతున్నాడు.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు.. కుమార స్వామినీ వదిలేశాడు.. సంక్షేమ పథకాలతో కేసీఆర్ ను కొట్టలేరు అని ఆయన పేర్కొన్నాడు.
మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గంలో సమస్యలపై స్పందించడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూముకుంట, శామీర్ పేట, ప్రాంతాల్లో గ్రంథాలయ భవన నిర్మాణాల శంకుస్థాపనకు విచ్చేసిన మంత్రి మల్లారెడ్డికి గ్రామస్తులు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని గ్రామస్థులు ఫైర్ అయ్యారు.