Tomoto Price Falls in Hyderabad Rythu Bazaar: గత కొన్ని రోజులుగా సామాన్య ప్రజలను ‘టమాటా’ ధరలు బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని అన్ని ప్రాంతాల్లో కిలో టమాటా రూ. 200పైనే ఉండడంతో కొంత మంది వాడడమే మానేశారు. అయితే గత మూడు రోజులుగా టమాటా ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. దిగుబడి పెరగడంతో టమాటా ధరలు దిగొస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ రైతుబజారులో కిలో టమాటా రూ. 63లుగా ఉంది. బయట మార్కెట్లలో మాత్రం కిలో టమాటా…
Pushpa 2 Shooting Update:పుష్ప సినిమాతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్న బన్నీ, సుకుమార్ రెండో పార్ట్ మీద ప్రాణం పెట్టి పని చేస్తున్నారు. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న హిట్ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. నిజానికి పుష్ప మూవీ రిలీజ్ అయి రెండేళ్లు కావొస్తుంది అయినా ఈ రెండవ భాగాన్ని జక్కన్నలా మారి చెక్కుతునే ఉన్నాడు…
ఎల్బీ స్టేడియం నుంచి ప్రజా యుద్ధనౌక, ప్రజాకవి గద్దర్ అంతిమయాత్ర కొనసాగుతుంది. గన్‌పార్క్, అసెంబ్లీ, నెక్లెస్‌రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక స్థూపం, ట్యాంక్‌బండ్, జేబీఎస్, తిరుమల మీదుగా అల్వాల్ చేరుకోనుంది.
ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. గద్దర్ అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. అయితే, ఎల్బీ స్టేడియంలో ఉంచిన గద్దర్ పార్థివదేహానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి ఘన నివాళులు ఆర్పించారు. తెలంగాణ ఉద్యమానికి గద్దర్ పాటలు ప్రాణం పోశాయని ఆమె తెలిపారు.
A young man stripped a woman on the road in Balajinagar: మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. ఆమెను నడి రోడ్డుపైనే వివస్త్రను చేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని బాలాజీనగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో రోడ్డుపై వెళ్తున్న వారు అడ్డుకోవాల్సింది పోయి.. వీడియోలు తీస్తూ చోద్యం చూశారు. 15 నిముషాల పాటు యువతి నగ్నంగా రోడ్డుపైనే ఏడుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు.…
ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము అని మేడ్చల్ డీసీపీ సందీవ్ రావు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాము.. ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేపడుతుంది అని డీసీపీ పేర్కొన్నారు. అన్ని శాఖల సిబ్బంది ఇక్కడే ఉన్నారు.. నిన్న సాయంత్రం నుండే చాలా మంది ఎల్బీ స్టేడియం దగ్గరకు వెళ్తున్నారు అని ఆయన తెలిపారు.
తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియలు నేడు( సోమవారం ) ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. గద్దర్ అల్వాల్‌లో స్థాపించిన మహా బోధి విద్యాలయంలోనే ఈ అంత్యక్రియలు జరుగనున్నాయి.
తన గొంతు ద్వారా తెలుగు సమాజమే కాకుండా యావత్ భారతదేశాన్ని కూడా రోల్ మాడల్ గా మార్చిన గొప్ప గాయకుడు గద్దర్ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గద్దర్ అనారోగ్యంతో మృతి చెందడం ప్రతి ఒక్కరికి బాధ కలిగించింది.. సిద్ధాంతాలు వేరైనప్పటికీ అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకున్నారు.. తెలంగాణ సాధన కోసం అంకిత భావంతో పోరాటం చేసిన వ్యక్తి గద్దర్ అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియలు నేడు( సోమవారం ) ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. గద్దర్ అల్వాల్‌లో స్థాపించిన మహా బోధి విద్యాలయంలోనే ఈ అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయన పార్థీవదేహాన్ని ఆదివారం సాయంత్రం నుంచి.. ఎల్బీ స్టేడియంలో ఉంచారు. తద్వారా బంధువులు, అభిమానులు, ఉద్యమకారులు.. ఆయన్ని కడసారి చూసేందుకు భారీగా తరలి వస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విలీన డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. ఇక, తెలంగాణ అసెంబ్లీలోని శాసనసభలో బిల్లు ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ తమిళిసై కన్సెంట్ ఇచ్చింది.