CWC Meeting: రేపు సీడబ్ల్యూసీ తొలి సమావేశం.. పలు అంశాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ నూతన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తొలి సమావేశం శనివారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణాలో నిర్వహించనున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ వ్యూహం, విపక్షాల కూటమి (INDIA), రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. అంతేకాకుండా.. ‘భారత్ జోడో యాత్ర’ రెండో దశపై కూడా ఈ వర్కింగ్ కమిటీలో చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 17న విస్తృత వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వర్కింగ్ కమిటీ సభ్యులందరితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ఈ సమావేశం అనంతరం తుక్కుగూడలో నిర్వహించే ‘విజయభేరి’ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
Nipah Virus: కేరళలో మరో నిపా కేసు.. డేంజర్ అంటున్న వైద్యులు..!
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఈ సమావేశంలోనే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలను చర్చించనున్నారు. ఇండియా కూటమితో అనుసరించే వ్యూహాలు, తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు లేదంటే జమిలి ఎన్నికలు వస్తే ఎలా వ్యవహారించాలనే అంశాలపైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రెండో రోజు ఉదయం నుంచి మధ్యాహ్నాం వరకు సీడబ్ల్యూసీ విస్తృతస్థాయి సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, ఏఐసీసీ ప్రధానకార్యదర్శులు, ఏఐసీసీ కార్యదర్శులు, కేంద్ర మాజీ మంత్రుల, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులతో పాటు పార్టీ సీనియర్లు పాల్గొననున్నారు. మొదటి రోజు తీసుకున్న నిర్ణయాలతో పాటు, అదనంగా మరికొన్ని అంశాపై చర్చిస్తారని పార్టీ వర్గాల మేరకు తెలుస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక పరిస్థితి, చైనా సరిహద్దులో ఉద్రిక్తత, అవినీతి ఆరోపణలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహంపై కూడా చర్చించవచ్చని పార్టీ వర్గాల సమాచారం.
Mahadev Gambling App: UAEలో పెళ్లి కోసం రూ. 200 కోట్ల ఖర్చు.. బట్టబయలు చేసిన ఈడీ
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీతో సహా పలువురు సీనియర్ నేతలతో పాటు.. కాంగ్రెస్ తన కార్యవర్గాన్ని ఆగస్టు 20న పునర్నిర్మించింది. కార్యవర్గంలో 39 మంది సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 13 మంది ప్రత్యేక ఆహ్వానితులను చేర్చారు. సచిన్ పైలట్, శశిథరూర్ వంటి నేతలకు తొలిసారిగా ఈ వర్కింగ్ కమిటీలో చోటు దక్కింది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!