నేడు హైదరాబాద్ నగరంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్-బీజేపీ పార్టీలు పోటాపోటీగా ‘సెప్టెంబర్ 17’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటంతో పోలీసు విభాగం అలర్ట్ అయింది. ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల నేపథ్యంలో నిన్నటి నుంచి ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకలతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నగరంలోనే ఉన్నారు.
Read Also: Astrology: సెప్టెంబర్ 17, ఆదివారం దినఫలాలు
ఇక, పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమాలతో పోలీసులు గతానికి భిన్నంగా బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అటు పరేడ్ గ్రౌండ్, ఇటు పబ్లిక్ గార్డెన్స్ కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నారు.
Read Also: Tirumala: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నేడే..
హైదరాబాద్ లో ట్రాఫిక్ మళ్లింపులు..
1. ఎంజే మార్కెట్ నుంచి పబ్లిక్ గార్డెన్స్ వైపు వచ్ వెహికిల్స్ ను తాజ్ ఐలాండ్ నుంచి ఏక్ మినార్ వైపు మళ్లింపు.
2. నాపంల్లి రైల్వే స్టేషన్ నుంచి పబ్లిక్ గార్డెన్స్ వైపు వచ్చే వాహనాలను ఛాపెల్ రోడ్ టీ జంక్షన్ నుంచి దారి మళ్లింపు
3. నిరంకారి నుంచి ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ వైపు వచ్చే వెహికిల్స్ టెలిఫోన్ భవన్ వైపుకు మళ్లింపు
4. బషీర్‌బాగ్ జంక్షన్, ఇక్బాల్ మినార్, ఏఆర్ పెట్రోల్ పంప్, ఆదర్శ్ నగర్‌ల వైపు నుంచి పబ్లిక్ గార్డెన్స్ వైపు వచ్చే వెహికిల్స్ ను ఇతర రూట్స్ లో పింపిస్తున్నారు.
5. ప్లాజా ఎక్స్ రోడ్ నుంచి ఎస్‌బీఐ చౌరస్తా మధ్య మార్గాన్ని పూర్తిగా ట్రాఫిక్ పోలీసులు బంద్ చేశారు.. వైఎంసీఏ ఫ్లైఓవర్ పై నుంచి మాత్రమే వాహనాలకు అనుమతి
6. బోయిన్‌పల్లి–తాడ్‌బండ్ వైపు నుంచి వచ్చే వెహికిల్స్ సీటీఓ వైపుకు మళ్లింపు. కార్ఖానా–జేబీఎస్ వైపు నుంచి వచ్చే వాహనాలను స్వీకార్ ఉపకార్ నుంచి టివోలీ వైపుకు దారి మళ్లింపు.
7. ఆర్పీ రోడ్ నుంచి ఎస్బీహెచ్ చౌరస్తా వైపు వచ్చే వాహనాలను ప్యాట్నీ నుంచి ప్యారడైజ్ లేదా క్లాక్ టవర్ వైపు మళ్లింపు
Read Also: Parliament: రేపటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..
ఇక, నేడు (ఆదివారం) నగరంలో పలు ప్రాంతాల్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎక్సామ్ జరుగుతుంది. ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్న చోట్లా ఈ పరీక్ష కేంద్రాలు ఉండటంతో అభ్యర్థులు ఆందోళనకు గురౌతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలను జారీ చేశారు. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు చూపించిన వారిని బారికేడింగ్ పాయింట్లు దాటి ముందుకు పంపాలని చెప్పుకొచ్చారు.