ఈ మధ్య కాలంలో అక్రమంగా పరిమితికి మించి బంగారాన్ని తరలిస్తున్నారు స్మగ్గలర్స్.. అధికారుల కళ్లు గప్పి తరలించాలని ఎన్నెన్నో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.. చివరికి చిన్న తప్పుతో సులువుగా దొరికిపోతున్నారు. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. హెయిర్ క్లిప్ లలో తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు లో 397 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. హెయిర్ క్లిప్ లలో, బ్యాంగిల్స్ లో కోటింగ్ వేసి…
రెండు చోట్ల పోటీ చేయనున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వెల్లడించారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి బరిలో దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. గజ్వేల్ సురక్షితమే అని ప్రచారం జరుగుతున్నా.. మరో స్థానం నుంచి కూడా పోటీ చేయాలని పార్టీలో కొందరు ముఖ్య నేతలు కేసీఆర్ కు సూచించినట్లు సమాచారం.
BCCI Vice President Rajeev Shukla Gaves Clarity on Hyderabad hosting World Cup 2023 Matches: హైదరాబాద్లోని ఉప్పల్ మైదానంలో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్లకు తాము సెక్యూరిటీ ఇవ్వలేమని నగర పోలీసు విభాగం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్-నెదర్లాండ్స్ మ్యాచ్ అక్టోబర్ 9న ఉండగా.. ఆ మరుసటి రోజే పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్ ఉంది. వరుసగా రెండు రోజుల్లో మ్యాచ్లను నిర్వహిస్తే.. సెక్యూరిటీపరంగా ఇబ్బందులు…
Gurukula Exam: గురుకుల పీజీటీ ఇంగ్లీష్ ఆన్లైన్ పరీక్షలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో హైదరాబాద్ హయత్ నగర్ పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
రాజకీయం, ప్రజాసేవలో ఉంటూ.. కళల పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తులు అరుదుగా ఉంటారని గ్లోబర్ స్టార్ రాంచరణ్ అన్నారు. అలాంటి అరుదైన, మంచి మనసున్న వ్యక్తి మన రాజ్య సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ అని రాంచరణ్ తెలిపారు.
మియాపూర్ లో దారుణం జరిగింది. భార్యతో పాటు ఆమె కుటుంబాన్ని చంపేందుకు భర్త కుట్ర చేశాడు. పెళ్లి విందులో భార్య కుటుంబ సభ్యులను చంపేందుకు విష ప్రయోగం చేశాడు. ఈ విష ప్రయోగంతో భార్య తల్లి చనిపోగా.. మిగతా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తిరగపడ్తామ్ తరిమి కొడతాం అనే కార్యక్రమంపై చర్చించామని ఆయన తెలిపారు. ఈనెల 21 నుంచి సెప్టెంబర్ 15 వరకు బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సర్కార్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని నిర్ణయించినట్లు పేర్కొన్నాడు.
హైదరాబాదలో మత్తు పదార్ధాలు అమ్ముతున్న వారిపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. పాతబస్తీలోని బహదూర్ పురా పొలీసులు గంజాయి అమ్ముతున్న ఇద్దరీతో పాటు గంజాయి కొని, సేవించే వారిని సైతం అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ పరిధిలోని భోలక్ పూర్ లో భారీ పేలుడు సంభవించింది. అంజుమన్ స్కూల్ సమీపంలోని స్టీల్ స్ర్కాప్ దుకాణంలో కెమికల్ బాక్స్ పేలింది. ఈ ప్రమాదంలో గౌసిద్దిన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి శరీరం పూర్తిగా కాలిపోయింది.