Liquor: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనగానే మీకు ముందుగా గుర్తుకు వచ్చేది ఏమిటి? అవును, తెలంగాణలో ఏ పండుగకైనా మందు తప్పనిసరిగా ఉండాలి. డిసెంబర్ 31 అంటే ఇకపై ఎంజాయ్ మామాలుగా ఉండదు. సుక్కతో పాటు ముక్క తప్పనిసరి. ఈసారి డిసెంబర్ 31 ఆదివారం కావడంతో మధ్యాహ్నం నుంచే వైన్స్ వద్ద భారీ రద్దీ నెలకొంది. ముఖ్యంగా యువత న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బీర్లతో పాటు హార్డ్‌ను కూడా వైన్ షాపు నిర్వాహకులు భారీగా విక్రయించారు.
తెలంగాణలో డిసెంబర్ 31న మద్యం విక్రయాలు పెరిగాయి. మద్యం డిపోలు తెరిచి మరీ వైన్ షాపులకు మందు, బీరులను వైన్ షాపులకు పంపించారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో రూ.658 కోట్ల మేర మద్యం, బీరు విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. ముందస్తుగా ఈవెంట్లు ఫిక్స్ చేసుకున్న వారితో పాటు క్లబ్బులు, పబ్ లలో పెద్దఎత్తున మద్యం తరలించారు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులను తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో భారీగా విక్రయాలు జరిగాయి.
Read Also:Maddali Giridhar Rao: బీసీ మహిళ గుంటూరులో పోటీ చేయకూడదా?.. టీడీపీ రౌడీ మూకల్ని ప్రజలు క్షమించరు!
రాత్రి ఒంటి గంట వరకు కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. మూడు రోజుల్లో 4.76 లక్షల కేసుల మద్యం, 6.31 లక్షల కేసుల బీర్లు విక్రయించినట్లు తెలుస్తోంది. 30వ తేదీనే రూ.313 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబర్ 31న భారీ సేల్స్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
మద్యంతో పాటు కూల్ డ్రింక్స్ కూడా భారీగా అమ్ముడయ్యాయి. అలాగే చికెన్, మటన్, చేపలు కూడా భారీగా అమ్ముడయ్యాయి. హైదరాబాద్‌లో నాన్ వెజ్ విక్రయాలు జోరందుకున్నాయి. సాధారణ రోజుల్లో రోజుకు 3 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరగగా.. ఆదివారం ఒక్కరోజే 4.5 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం చికెన్ విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే చికెన్ ధరలు అలాగే ఉన్నాయి.
Read Also:Calcutta High Court : సామాజిక బహిష్కరణ విషయంలో కఠినంగా వ్యవహరించండి : హైకోర్టు