Shamshabad: దట్టమైన పొగమంచు కారణంగా దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాలు రద్దు అయ్యాయి. మూడు రోజుల్లో 37 విమానాలను విమానాశ్రయ అధికారులు రద్దు చేశారు. వాతావరణంలో మార్పుల కారణంగా గత మూడు రోజులుగా మంచు విపరీతంగా కురుస్తోంది. శంషాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు వెళ్లే విమానాలు… ఆదివారం 14, సోమవారం 15, మంగళవారం 8 విమానాలు రద్దయ్యాయి. విమాన సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, ముంబై, కోల్‌కతాలోని విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వార్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు.
Read also: Delhi : ఢిల్లీలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. పొగమంచు కారణంగా 53 విమానాలు రద్దు..
ఇది కాకుండా, విమాన సర్వీసుల నిర్వహణకు సంబంధించి విమానయాన సంస్థలకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOP) విడుదల చేశారు. కాగా, దట్టమైన పొగమంచు కారణంగా ఆదివారం, సోమ, మంగళవారాల్లో ఢిల్లీ విమానాశ్రయంలో 100కు పైగా విమానాలు రద్దు చేయబడ్డాయి. 150కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాలు ఆలస్యం, రద్దు కారణంగా ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. ఒకటి రెండు గంటలు కాదని ఏకంగా ఐదు, ఆరు గంటలు ఆలస్యం అవుతున్నాయని మండిపడుతున్నారు. ఎయిర్ పోర్టులోనే వేచి ఉండటం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయంలో గమ్యస్థానానికి చేరుకోలేకపోతున్నామని వాపోతున్నారు. పనులు కారణంగా మా షెడ్యూల్ కు అంతరాయం ఏర్పడుతుందని మండిపడుతున్నారు.
Delhi : ఢిల్లీలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. పొగమంచు కారణంగా 53 విమానాలు రద్దు..