Ayodhya Ram Mandhir: అయోధ్య శ్రీరాముడి దగ్గర హైదరాబాద్‌లో భారీ లడ్డూలు తయారయ్యాయి. హైదరాబాద్ కంటోన్మెంట్ పికెట్ ప్రాంతానికి చెందిన శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం రెడ్డి, కృష్ణకుమారిలు రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా 1,265 కిలోల భారీ లడ్డూను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. వారు దానిని అయోధ్యకు పంపుతారు. ఆలయ నిర్మాణానికి భూమిపూజ నుంచి శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన వరకు 1,265 రోజులు పట్టింది. దీనికి గుర్తుగా నాగభూషణం దంపతులు అదే నెంబరుతో లడ్డూను తయారు చేశారు. ఈరోజు ఉదయం 6 గంటలకు పికెట్‌లోని తమ నివాసం నుంచి లడ్డూ శోభాయాత్ర ప్రారంభించారు. ఈ విషయమై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధి చంపత్రాయ్‌ను సంప్రదించి అనుమతి పొందారు. ఆయన సూచనలతో 1,265 కిలోల బరువున్న లడ్డూలను తయారు చేశామన్నారు.
Read also: Big Alert: పట్నం బాట పట్టిన జనాలు.. టోల్ ప్లాజా వద్ద మొదలైన రద్దీ..!
హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రసాద సామగ్రి..
విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ కార్యకర్తలు హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రసాద సామగ్రిని పంపారు. బషీర్ బాగ్‌లోని శ్రీ నాగలక్ష్మీ మాత దేవాలయం నుండి అయోధ్య ధామ్ వరకు వెళ్తున్న ప్రసాద సామగ్రి వాహనాన్ని జెండాను ఎగురవేశారు. విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి రామారావు మాట్లాడుతూ దాతల సహకారంతో 45 రోజులపాటు నిత్యం 5 వేల మందికి అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు అయోధ్యలో అన్నదానం కోసం కమిటీని నియమించింది. ఈ కార్యక్రమం సంక్రాంతి (14) నుంచి ఫిబ్రవరి 28 వరకు జరిగింది. హైదరాబాద్ నుంచి దాదాపు 150 మంది విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ కార్యకర్తలు వాలంటీర్లుగా అయోధ్య వెళ్తున్నారని తెలిపారు. అలాగే రోజూ 35 మంది వంటవాళ్లు వండి వడ్డించబోతున్నారు. అయోధ్యలోని గోలాఘాట్ రోడ్డులో ఉన్న శ్రీరామస్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. ఆహార తయారీకి అవసరమైన 40 టన్నుల వివిధ సామాగ్రిని ఇప్పటికే సేకరించి అవసరమైన దాతల నుండి పంపినట్లు రామారావు తెలిపారు.
Big Alert: పట్నం బాట పట్టిన జనాలు.. టోల్ ప్లాజా వద్ద మొదలైన రద్దీ..!