బీఆర్ఎస్ భవన్ లో సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె .కేశవ రావు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. జెండా మోసిన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా.. ఉద్యమకారుల్లో ఉన్న అసంతృప్తిని గుర్తించాం.. వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుంది అని అన్నారు. కాగా.. తెలంగాణలో హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలు హీరోలు అని పొగిడారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని పవన్‌కళ్యాణ్ నివాసంలో ఈ భేటీ జరిగింది. వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరి జనసేనలో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
Hyderabad Crime: అంబర్‌పేటలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలుడు (16) ఘాటుకి దిగాడు. ప్రేమించాలంటూ ఓ అమ్మాయిపై కత్తితో దాడి చేసిన బాలుడు శవమై కనిపించాడు.
Property Rates: ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఓ కల. రోజు రోజుకు సామాన్యులు ఆ కలను నెరవేర్చుకునేందుకు నానాకష్టాలు పడుతున్నారు. దేశవ్యాప్తంగా స్థిరాస్తుల ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణం.
Shavarma: హైదరాబాద్‌లోని అల్వాల్‌లో షవర్మా తిని 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొదట నలుగురు మాత్రమే అస్వస్థతకు గురయ్యారు, ఐదు రోజుల్లో బాధితుల సంఖ్య 17 కి చేరుకుంది.
Vikarabad Crime: వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. అటవీ ప్రాంతంలో మహిళ మెడకు చీర కట్టి పెట్రోల్ పోసి నిప్పంటించాడు హంతకుడు.
Nampally Court: హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అదనపు కట్నం కోసం భార్యను హత్య చేసిన భర్తకు మరణశిక్ష పడింది. 2018కి సంబంధించిన ఓ కేసులో నిందితుడికి నాంపల్లి కోర్టు ఉరిశిక్ష విధించింది..
ఈ రోజు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో సమావేశం కానున్నారు.. హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ నివాసానికి ఈ రోజు ఉదయం 11 గంటలకు వెళ్లనున్న ఎంపీ బాలశౌరి.. జనసేనానితో చర్చలు జరపనున్నారు.. వచ్చే ఎన్నికల్లో జనసేనలో ఆయన పాత్ర ఏంటి? ఏ స్థానం నుంచి పోటీ చేయాలి..? అనే అంశాలపై పవన్‌తో చర్చించబోతున్నారు.. అయితే, మచిలీపట్నం లేదా గుంటూరు లోక్ సభ నుంచి జనసేన పార్టీ తరపున వల్లభనేని బాలశౌరి బరిలోకి దిగే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతోంది.…
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ లో తన సోదరి షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు సతీసమేతంగా హాజరయ్యారు. వైఎస్ రాజారెడ్డి, ప్రియ అట్లూరి నిశ్చితార్థ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు.
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణను తెలుగు టైటాన్స్ ప్లేయర్స్ కలిశారు. రేపటి (జనవరి 19) నుంచి హైదరాబాద్ లో తెలుగు టైటాన్స్ కు చెందిన మ్యాచ్‌లు మొదలుకానున్నాయి.