Vishwambhara : టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తోన్న 156వ చిత్రం ‘విశ్వంభర’. భారీ బడ్జెట్‌తో ‘బింబిసారా’ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. దీని విడుదల తేదీని తాజాగా చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ‘అతీత శక్తుల పోరాటం నుంచి లెజెండ్స్ అవతరిస్తారు’ అంటూ పవర్‌ఫుల్ పోస్టర్‌ను షేర్ చేసింది. దీంతో ఈ హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
Read Also:Maldives President: మే 10 నాటికి మాల్దీవుల నుంచి భారత సైన్యం వెళ్లి పోవాల్సిందే..
Welcome on board
The Gorgeous @trishtrashers ! #Vishwambhara pic.twitter.com/wqXUQF4gZH— Chiranjeevi Konidela (@KChiruTweets) February 5, 2024
Read Also:Rohit Sharma Catch: రోహిత్ శర్మ సూపర్ క్యాచ్.. ఓలీ పోప్ ఔట్!
ఈ సినిమాలో చిరుతో మరో సారి చిందేయబోతుంది త్రిష. కెరీర్ ప్రారంభించి ఇరవయ్యేళ్లు దాటినా.. ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతోంది ముద్దుగుమ్మ. 18 ఏళ్ల క్రితం ‘స్టాలిన్’ చిత్రంతో మెప్పించిన ఈ జంట మరోసారి స్ర్కీన్‌పై కనిపించబోతుంది. కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న ఈ న్యూస్ దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్‌లో జరుగుతోంది. ఈ నెల 9 నుంచి సాంగ్ షూట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్‌లోనే త్రిష జాయిన్ కానుంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు రీసెంట్‌గా ప్రకటించారు.